Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ఒక కొత్త ఐపీఎల్ టీం ని కొనుగోలు చెయ్యబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ఒక ప్రచారం జోరుగా సాగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో ఇలాంటి రూమర్స్ చాలా వచ్చాయి. ఇవన్నీ గాలి వార్తలే అని అనుకున్నారు. కానీ నిజంగానే రామ్ చరణ్ ఒక టీం కి ఓనర్ గా వ్యవహరించబోతున్నాడు.
కానీ అది ఐపీఎల్ మాత్రం కాదు, ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్’ లోని హైదరాబాద్ టీం కి ఓనర్ గా వ్యవహరించబోతున్నాడు. బెంగళూరు టీం కి హృతిక్ రోషన్, ముంబై టీం కి అమితాబ్ బచ్చన్ మరియు శ్రీ నగర్ టీం కి అక్షయ్ కుమార్ ఓనర్లు గా వ్యవహరిస్తుండగా, మన హైదరాబాద్ టీం కి రామ్ చరణ్ ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ లీగ్ మ్యాచులు వచ్చే ఏడాది మర్చి 24 నుండి ప్రారంభం కానుంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి కాసేపటి క్రితమే విడుదల చెయ్యగా దానికి సోషల్ మీడియా నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ లీగ్ మ్యాచులను ప్రత్యక్షంగా చూడాలంటే ispl-t10.com రిజిస్టర్ అవ్వాలి. రామ్ చరణ్ ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారాలు చెయ్యడం కొత్తేమి కాదు. ఆయన కెరీర్ ప్రారంభం నుండే ఇలాంటివి చేస్తే ఉన్నాడు.
ఇప్పుడు బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం కి రామ్ చరణ్ ని గుర్తించడం ఇది నిజంగా ఆయన అభిమానులకు మరియు మన టాలీవుడ్ కి గర్వకారణం అనే చెప్పాలి. ఈ లీగ్ మ్యాచులు ఐపీఎల్ రేంజ్ లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది వినాయక చవితి రోజు విడుదల కాబోతుంది.
Excited to announce the proud owner of Team Hyderabad, @AlwaysRamCharan, in the ISPLT10!💥
— ISPL (@ispl_t10) December 24, 2023
Join the Mega Power Star and his Team Hyderabad now! Registrations are open on https://t.co/S4QoVw2oZQ #NewT10Era #Street2Stadium #HyderabadCricket #ISPL2023 #RamCharan pic.twitter.com/QUJUnv2IMo