Upasana Konidela : టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రామ్ చరణ్ మరియు ఉపాసన పేర్లు కచ్చితంగా ఉంటాయి. వీళ్ళ మధ్య ఉన్న అన్యోన్య దాంపత్య జీవితం కొత్తగా పెళ్ళైన ప్రతీ ఒక్కరికి ఒక ఆదర్శప్రాయం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్య భర్తలు అంటే ఇలాగే ఉండాలి అని అనిపించేంత గొప్ప దంపతులు వీళ్ళు. రీసెంట్ గానే ఈ జంట కి క్లిన్ కారా అనే పాప జన్మించిన సంగతి మన అందరికీ తెలిసిందే.
పెళ్ళైన 11 ఏళ్లకు పాప పుట్టడం తో అటు మెగా కుటుంబం లో ఎంత సంతోషం ఉందో, ఇటు మెగా అభిమానుల్లో కూడా అంతే సంతోష వాతావరణం ఏర్పడింది. చిన్న చిన్న కారణాలను సాకుగా పెట్టుకొని భార్య భర్తలు విడిపోతున్న ఈ రోజుల్లో, 11 ఏళ్ళు పిల్లలు లేకపోయినా కూడా ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాకపోవడం అనేది అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మరో బేబీ రాబోతుంది’ అంటూ ఆమె పెట్టిన ఒక పోస్టుని చూసి అభిమానులు ఉపాసన మళ్ళీ తల్లి అవ్వబోతుందా అని అనుకున్నారు. కానీ ఆ బేబీ పుట్టబోయేది ఉపాసనకు కాదు, ఆమె చెల్లెలు అన్షుపాలకు. ఈమెకి పెళ్లి జరిగి దాదాపుగా మూడేళ్లు అవుతుంది, ఇప్పుడు ఆమె కూడా అతి త్వరలోనే తల్లి కాబోతుంది అట.
అంటే ఉపాసన పెద్దమ్మ కాబోతుంది. పుట్టబోయ్యే బేబీ కి ఉపాసన కూడా సొంత తల్లి లెక్కనే అన్నమాట. ఆ విధంగా మరోసారి తల్లి కాబోతుంది అని సోషల్ మీడియా లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే క్లిన్ కారా ముఖాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు రామ్ చరణ్ మరియు ఉపాసన క్లిన్ కారా ముఖాన్ని కవర్ చేస్తూనే ఫోటోలను అప్లోడ్ చేస్తూ వచ్చారు.