Rakul Preet Singh : ఈ పంజాబీ భామకు ఫిట్ నెస్ పై మక్కువ ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ఫుడ్, ఫిల్మ్స్, ఫిట్ నెస్ అంటే చాలా ఇష్టమని ఈ బ్యూటీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. అందుకే ఎఫ్45 అనే జిమ్ కూడా నడుపుతోంది ఈ భామ. తాజాగా ఈ బ్యూటీ జిమ్ లో తెగ కష్టపడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రకుల్ జిమ్ లో చాలా కఠినతరమైన వర్కవుట్ చేస్తున్నట్లు కనిపించింది. ట్రైనర్ సాయంతో ఈ వర్కవుట్ చేసింది. ఈ వీడియోను నెట్టింట పోస్టు చేసి వర్కవుట్ డన్ రైట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు అందుకే రకుల్ ఇంత ఫిట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో మరీ సన్నగా అయిపోయిందంటున్నారు.
View this post on Instagram
ఇక రకుల్ సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ తన మకాం ముంబయికి మార్చేసింది. అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. ఇటీవలే ఈ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీని వివాహ మాడింది. ఇక మొత్తం ముంబయిలోనే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఈవెంట్స్ కోసం హైదరాబాద్ వస్తోంది.