ఆ స్టార్ హీరోతో రెండేళ్లు డేటింగ్ చేసిన ర‌కుల్‌.. పెళ్లి దాకా వచ్చి

- Advertisement -

Rakul : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువై తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హోదానే దక్కించుకుంది. తొలి చిత్రం సూపర్ హిట్ సాధించడంతో గోల్డెన్‌ లెగ్‌ అని అన్నారు. ఆ తర్వాత రెండు సినిమాలు ప్లాప్ అయ్యే సరికి ఐరెన్‌లెగ్‌ అన్నారు. మళ్లీ సక్సెస్ రావడంతో తిరిగి గోల్డెన్‌ లెగ్‌ అనిపించుకుంది. ఈ బిరుదులు శాశ్వతం కాదు. ఐరెన్‌లెగ్‌ అని అన్నా పట్టించుకోను అని రకుల్ అప్పట్లో పేర్కొంది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లో వెలుగుతోంది. హిట్​, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. అలాగే మ‌రోవైపు బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతుందట.

ఫ్రీ టైమ్ దొరికిందంటే చాలు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని పార్టీలు, పబ్బులంటూ తిరిగేస్తుంది. అయితే ర‌కుల్ జాకీ భగ్నానీ కంటే ముందే టాలీవుడ్ కు చెందిన కొంద‌రు హీరోలతో లవ్ స్టోరీలు నడిచాయట. ఈ జాబితాలో రానా ద‌గ్గుబాటి కూడా ఉన్నాడు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన కొత్త‌లోనే రకుల్ రానా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. దాదాపు రెండేళ్లు ఇద్ద‌రూ డేటింగ్ చేశారంటు గుసగుసలు వినిపించాయి. అంతే కాదు ఇటీవల కొనుగోలు చేసిన ఇంటిని ఓ హీరో బహుమతిగా ఇచ్చారనే రూమర్ కూడా వచ్చింది, అయితే ఆ రూమర్‌ను రకుల్ ఖండించారు. తాను కొనుగోలు చేసిన ఇంటి విలువ మూడు కోట్లు. ఎవరో గిఫ్ట్ ఇస్తే బ్యాంక్ లోను ఎందుకు తీసుకుంటానని చెప్పింది. అయితే రానాలో అప్పట్లో తెగ ఎంజాయ్ చేసిందట. అంతే కాకుండా రానా, ర‌కుల్ పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, పెళ్లి వ‌ర‌కు రాకుండానే వారిద్దరు విడిపోయారు. వీరి పెళ్లికి ఓ ప్రముఖ వ్యక్తి అడ్డుపడినట్లు కూడా టాక్ నడిచింది. ర‌కుల్, రానా విడిపోయాక కూడా ప్రస్తుతం త‌మ స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. రానా 2020లో మిహీకా బజాజ్ ను పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here