Rakul Preet Singh : ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో హాట్ టాపిక్ మారింది రకుల్ ప్రీత్. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ప్రియుడు జాకీ భగ్నానీని ఆమె వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. వీటికి మరింత ఊతమిస్తూ, ఆమె జాకీతో కలిసి దేవాలయాలు సందర్శిస్తోంది, ప్రత్యేక పూజలు చేస్తోంది. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడింది రకుల్. పెళ్లి పుకార్లను తేలిగ్గా తీసుకున్న ఈ బ్యూటీ, ఎక్కువ కాలం సింగిల్ గా ఉన్న హీరోయిన్ ను తానే అంటూ ప్రకటించుకుంది. ఈ సందర్భంగా జాకీతో తన అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంది. తామిద్దరం రోజుకు ఒక గంట మాత్రమే గడుపుతామని తెలిపింది.
‘ప్రతి ఒక్కరూ భాగస్వామిని కలిగి ఉండడం సహజమైన ప్రక్రియ. సినీ పరిశ్రమలో ఉన్న వారిపై ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. నేను ఎన్నో సంవత్సరాలు ఒంటరిగా జీవించాను. జాకీ నా జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. అతడు ఇదే పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. మేమిద్దరం సినిమా, ఫిట్నెస్ను ఇష్టపడతాం. రోజుకు 12 గంటలు షూటింగ్లో బిజీగా ఉంటాం. గంట మాత్రమే కలిసి సమయాన్ని గడుపుతాం. ఆ సమయంలో వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం’’ అని చెప్పింది.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ..‘‘పదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. సినీ నేపథ్యం లేకపోవడం వల్ల మొదట్లో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియలేదు. నా తొలి సినిమాతోనే ఆదరణ లభించడం అదృష్టం. సినీ కెరీర్ నాకెంతో సంతృప్తినిచ్చింది. ఎక్కువగా కుటుంబంతో కలిసి చూసే సినిమాల్లోనే నటించాను. మంచి స్క్రిప్ట్ అయితే ఎక్కువ గంటలు కూడా పనిచేశాను. పారితోషికం గురించి ఆలోచించలేదు’’ అన్నది.