Rakul Preet Singh : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటీమణులలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్. ‘కెరటం’ సినిమాతో ప్రారంభమైన ఈ కెరీర్, ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.
తెలుగు లో ఆమె రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ మాత్రం మిస్ అయ్యారు. కేవలం టాలీవుడ్ లోనే కాదు, కోలీవుడ్ లో కూడా ఈమె టాప్ స్టార్స్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలా కెరీర్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ బ్రేక్స్ వేసాయి. దీంతో రెండేళ్ల నుండి ఆమె సౌత్ లో కనిపించకుండా పోయింది.
కానీ రీసెంట్ గా ఆమె తమిళ హీరో శివ కార్తికేయన్ తో ‘ఆయలన్’ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఆడింది కానీ, రకుల్ ప్రీత్ సింగ్ కి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. అంతకు ముందు ఆమె బాలీవుడ్ లో పలు సినిమాలు వెబ్ సిరీస్ లు చేసినా కూడా పెద్దగా లాభం లేకుండా పోయింది. దీంతో కెరీర్ దాదాపుగా అయిపోయినట్టే అని ఫిక్స్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళికి సిద్ధమైంది. ఆమె చాలా కాలం నుండి జాకీ భగ్నానీ అనే అతనితో ప్రేమలో ఉంది.
వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసుకుంటున్నారు. త్వరలోనే మాల్దీవ్స్ లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వీళ్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రేక్ వేసాడు. స్టార్ సెలెబ్రిటీలు ఇక నుండి ఇండియా లోనే ప్రముఖ ప్రదేశాలలో పెళ్లి చేసుకోవాలని పిలుపుని ఇచ్చారు. దీంతో మాల్దీవ్స్ లో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్, గోవాలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆమె తన సోషల్ మీడియా ద్వారా తెలియచెయ్యనుంది.