Rakul Preet Singh : కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీలో అలాంటి పాత్ర చేయనున్న రకుల్

- Advertisement -


Rakul Preet Singh : ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చేవి. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, రవితేజ వంటి స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇటు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు వచ్చాయి. అక్కడ కూడా వరుస సినిమాలతో అలరించింది. కానీ హిందీలో ఆమెకు ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. అక్కడ రకుల్ ఒకట్రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు.

సినిమా ఈవెంట్‌లు, పార్టీల్లో మాత్రమే టైం స్పెండ్ చేస్తోంది. సినిమా అవకాశాల్లేక ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తోంది. కానీ, అక్కడ కూడా ఆశించిన రేంజ్ లో క్రేజ్ రావడం లేదు. దీంతో త్వరలో ఆమె తన ప్రియుడు జాకీ భగ్నానిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. దీంతో ఈ బ్యూటీ తన సినిమా ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్నాళ్లు ఎలాంటి ఆఫర్లు లేకుండా సైలెంట్ గా ఉన్న రకుల్ ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాతలు, నిర్మాత అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే నటీనటుల ఎంపిక పనులు మొదలయ్యాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తాడని, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపిస్తాడని టాక్ కూడా ఉంది. అయితే ఈ సినిమాలో శూర్పణఖ అనే కీలక పాత్రలో రకుల్ నటించిందని సమాచారం. ఈ పాత్ర కోసం మేకర్స్ ఆమెను సంప్రదించగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. విభీషణుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో నటించనున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here