Rakul Preet Singh: వయసు మళ్లిన వాడితో రొమాన్స్.. రకుల్ నీకేం పోయేకాలం అంటున్న నెటిజన్స్

- Advertisement -

Rakul Preet Singh: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా అగ్రహీరోల సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ అందుకుంది. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఈ మధ్య కాలంలో తన ప్రియుడు, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానిని పెళ్లి చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. పెళ్లి తర్వాత అమ్మడు మరింత జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో పాటు పలు బిజినెస్ లు మొదలు పెట్టి బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్‌ కీలక పాత్రలో నటించిన ఇండియన్‌ 2 రిలీజ్ కు రెడీగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆ సినిమా సెట్లోకి కూడా అడుగుపెట్టారు. బాలీవుడ్‌ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌, రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే ప్యార్‌ దే 2’.

తాజాగా ఈ సినిమా షూటింగ్ లో రకుల్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా వేదికగా తెలిపారు. ‘నా ఫేవరెట్‌ సినిమా దే దే ప్యార్‌ దే 2 సెట్స్‌లో జాయిన్‌ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో విడుదలైన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘దే దే ప్యార్‌ దే’కి కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. సీక్వెల్‌కు అకివ్‌ అలీకి బదులుగా అన్షుల్‌ శర్మ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మధ్య వయసు గల ఆశిష్‌ అనే వ్యక్తి ఇరవై ఏళ్ల ఆయేషా ప్రేమ కోసం పరితపిస్తుంటాడు. వయసుతో సంబంధం లేకుండా మొదలైన వీరిద్దరి ప్రేమ.. గెలిచిందో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు ఆగాల్సిందే. ఆగాల్సిందే. దే దే ప్యార్‌ దే 2ను భూషణ్‌ కుమార్, లవ్‌రంజన్‌ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల కానుంది. ఇందులో అనిల్‌ కపూర్, మాధవన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here