Rakul Preet : నవంబర్ లోనే అతనితో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి అయిపోయిందా..?షాకింగ్ న్యూస్ బయటపెట్టిన రకుల్

- Advertisement -

Rakul Preet : టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.’కెరటం’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ‘వెంకటాద్రి ఎక్సప్రెస్’ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని లైం లైట్ లోకి వచ్చింది.ఆ సినిమా హిట్టైన తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.వరుసగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

Rakul Preet
Rakul Preet

అలా ఎంత వేగంగా అయితే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిందో, వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వల్ల అంతే వేగంగా క్రిందకి పడిపోయింది.ఇప్పుడు ఈమెకి అవకాశాలు ఇచ్చే స్టార్ హీరోలు కానీ దర్శకులు కానీ లేరు.ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి.అందులో శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2 ‘ ఒకటి.

Rakul Preet Photos

అయితే పెళ్లి గురించి రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ గా చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ రీసెంట్ గా ఆమె పాల్గొన్న ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా ‘నాకు పెళ్లి పై తరుచూ రోజూ ఎదో ఒక వార్త సోషల్ మీడియా వస్తూనే ఉంటుంది.ఆ లెక్కన నాకు గత ఏడాది నవంబర్ లోనే పెళ్లైంది.కానీ మా పెళ్లి ఎలా జరిగిందో మాత్రం చెప్పలేను’ అంటూ వ్యగ్యంగా సమాధానం చెప్పింది.

- Advertisement -

ఇది ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉంది. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారు. అనేక సందర్భాలలో రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది . వీళ్లిద్దరు కలిసి ప్రైవేట్ పార్టీలకు మరియు పబ్బులకు హాజరైన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కానీ వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేదానిపై క్లారిటీ లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here