Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తను కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సి రాలేదు. తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. తెలుగుతో పాటే తమిళం, హిందీలోనూ అవకాశాలు అందుకుంది. టాలీవుడ్‌లో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్‌ను సొంతం చేసుకుంది.

కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న టైంలోనే తన స్నేహితుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే కుటుంబ సబ్యుల సమక్షంలో ఫిబ్రవరి 21న గోవాలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
ప్రస్తుతం సినిమా అవకాశాలు లేనప్పటికీ.. అభిమానుల్లో ఆమె పట్ల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక సినిమాలు, వ్యక్తిగత విషయాలు పక్కన పడితే.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. అంతే కాకుండా తన గ్లామరస్ పిక్స్‌తో అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రకుల్ కళ్లు చెదిరిపోయేలా బికినీలో మెరిసిపోయింది. నీలం రంగు అవుట్ ఫిట్ లో అమ్మడి అందాలు అదరహో అనిపిస్తున్నాయి. ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram