Rakul Preet : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ కు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తారక్, రామ్ చరణ్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టులపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. రకుల్ రీసెంట్‌గా నటుడు, నిర్మాత అయిన జాకీభగ్నానీ తో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఈ ఇద్దరూ గోవాలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌తో ఒక్కటయ్యారు.

ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ఈ మధ్య సినిమాలు చేయలేదు. దాంతో బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. సినిమాలు లేకపోయినా ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవనంలో కొత్త జంట ఫోజులిచ్చింది. అంతేకాదు.. సత్యమేవ జయతే అంటూ రకుల్ షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరూ కలిసి కొత్త పార్లమెంట్ ను చుట్టివచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రకుల్, జాకీలు బాలీవుడ్ సినిమాల పై మాత్రమే ఫోకస్ పెట్టారు.
రకుల్ ఇప్పటికే ఫిట్‌నెస్ బిజిసెన్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్‌లలో F-45 పేరుతో జిమ్‌లను ఏర్పాటు చేసింది. చాలా మంది స్టార్ హీరోలు ఈ జిమ్‌లకు వెలుతుంటారు. మరోవైపు వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో రకుల్‌కు భాగస్వామ్యం ఉంది. అయితే ఇవికాకుండా నేరుగా ఫుడ్ బిజినెస్‌లోకి రకుల్ ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ప్రారంభించింది. మాదాపూర్‌లో ఈ నెల 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఇందులో మిల్లెట్స్‌తో చేసిన వంటకాలు లభించనున్నాయి.