Rajinikanth : సినీ ఇండస్ట్రీ ఆరాధ్య దైవం సూపర్ స్టార్. పేరుకు కోలీవుడ్ హీరో అయినా ప్రపంచమంతా ఆయనకు అభిమానులున్నారు. ఎక్కడికి వెళ్లిన ఆయన అభిమానులు నీరాజనం పలుకుతారు. కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి సినిమా రంగంలోకి అడుగుపెట్టి సూపర్‌స్టార్ గా ఎదిగాడు. రజనీకాంత్ 2010 సంవత్సరంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఫోర్బ్స్ పేర్కొంది. అతని మొత్తం ఆస్తులు 52 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 430 కోట్లు. ప్రస్తుతం రజనీ ఒక్క సినిమాకు 50 కోట్లు తీసుకుంటున్నాడు.
ఒక వేళ సినిమా బాగా రాకపోతే తాను తీసుకున్న రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేస్తారని అంటున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీనిని అతను 2002లో ఆ ఇంటిని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం దాని విలువ సుమారు 4.2మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.35కోట్లు. అలాగే ఆయనకు రాఘవేంద్ర మండపం అనే కళ్యాణ మండపం కూడా ఉంది. ఇందులో 275 మంది అతిథులు, 1000 మందికి పైగా ఆహ్వానితులు కూర్చునే సామర్థ్యం ఉంది.
దీని విలువ దాదాపు రూ.20కోట్లు ఉంటుందని అంచనా. రజనీకాంత్ వద్ద రెండు రోల్స్ రాయిస్ సహా అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.6 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్, రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ ఉన్నాయి. ఇవి కాకుండా టయోటా ఇన్నోవా, హోండా సివిక్, ప్రీమియర్ పద్మిని వంటి కార్లు కూడా ఉన్నాయి. అత్యంత ఖరీదైన వాహనాల్లో రూ. 1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్, రూ. 3.10 కోట్ల విలువైన లంబోర్గినీ ఉరస్ ఉన్నాయి.