గత కొన్నాళ్లుగా తీసిన ప్రతి సినిమా ప్లాప్ కావడంతో హిట్ కోసం సతమతమవుతున్నారు తలైవా రజినీ కాంత్. ఇక నేడు విడుదలైన జైలర్ మూవీపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఆయన. అంతేకాకుండా ట్రైలర్ చూస్తే హిట్ కొట్టడం ఖాయం అనిపించింది. అందుకే భారీ అంచనాలు సినిమాపై నెలకొన్నాయి. దీంతో భారీ అంచనాల మధ్య నేడు రిలీజైన జైలర్ సినిమా ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొట్టడం ఖాయమని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు. దీంతో తలైవా కమ్ బ్యాక్ గ్యారంటీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీ సరసన తమన్నా, రమకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషించారు. విశేషమేమిటంటే చెన్నై, బెంగుళూరు వంటి చోట్ల ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవు కూడా ప్రకటించాయి. ఆ రేంజ్ లో జైలర్ మేనియా కొనసాగుతోంది. మరోవైపు చిత్ర ప్రమోషన్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
తాజాగా చెన్నైలో ఆడియో లాంచ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఆ వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ హీరోయిన్ ముందు తన పరువు తీసేశాడని చలోక్తి విసిరారు. రజనీ వెల్లడించిన హీరోయిన్ మరెవరో కాదు రమ్యకృష్ణ. రజనీకాంత్ రమ్యకృష్ణ కాంబోలో నరసింహ
లాంటి సంచలనాత్మక సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో నీలాంబరి పాత్రలో లేడీ విలన్ రోల్ లో రమ్యకృష్ణ అదరగొట్టేసింది. ఈ సినిమాతో రమ్యకృష్ణ స్టార్ డమ్ రెట్టింపు అయింది. మళ్లీ పాతికేళ్లకు రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది. అయితే షూటింగ్ టైమ్ లో జరిగిన సంగతులను రజనీకాంత్ తన అభిమానులతో పంచుకున్నారు. రజనీకాంత్ మాట్లాడుతూ .. 25 ఏళ్ల తర్వాత రమ్యతో కలిసి ఈ
సినిమాలో నటించాను. మా ఇద్దరి సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ ఇది ఎక్కువైంది.. అది తక్కువైంది అంటూ ఓ సీన్ కు 8టేకులు తీసుకున్నాడు. నీలాంబరి ముందు ఈ నరసింహ పరువు తీసేశాడు
అంటూ సరదాగా రజినీ కాంత్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.