బస్ కండక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్. మొదట్లో సోసో అనిపించినా… తర్వాత తర్వాత సూపర్ స్టార్ గా ఎదిగారు. తమిళనాడులో దేవుడి ఫోటో అయిన ఉండని ఇళ్లు ఉంటుందో లేదో కానీ.. రజినీ కాంత్ ఫోటో లేని ఇళ్లు ఉండదంటే నమ్మశక్యం కాదు. అంతలా అభిమానులను సంపాదించుకున్నారు రజినీ కాంత్. ఆయన తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. ఎన్నో ఎన్నెన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించారు. మూడు తరాల హీరోయిన్లతో నటించిన ఒక్క రజినీ కాంత్ కే దక్కింది. 1980లలో శ్రీదేవి, శ్రీవిద్య లాంటి హీరోయిన్లతో మొదలుపెట్టారు సూపర్ స్టార్. ఆ తర్వాత నగ్మా, మీనా, రమ్యకృష్ణ జనరేషన్తో ఆడిపాడారు. తర్వాత నయనతార, శ్రియ.. ఇక తాజాగా తమన్నా, రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు.

అప్పట్లో రజనీకాంత్ శ్రీదేవి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి జోడి అప్పట్లో తిరుగులేని బావుటా ఎగరవేసింది. వారిద్దరు కలిసి నటించిన సినిమా వస్తుందంటే చాటు థియేటర్ల దగ్గర అభిమానుల కోలాహలం నెలకొనేది. అయితే రజనీ కాంత్ పెళ్లికి ముందు శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవారట. అప్పటికే శ్రీదేవి విశ్వనటుడు కమల్ హాసన్ ప్రేమలో పడి మోసపోయింది. కమల్ హాసన్ చేసిన మోసంతో రజనీని ఆమె గుడ్డిగా నమ్మేసింది. తను ఇంటికి తరచూ వస్తుండడంతో ప్రేమలో ఈ క్రమంలోనే రజినీ కాంత్ తో శ్రీదేవి ప్రేమలో పడిపోయింది. రజిని తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని శ్రీదేవి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకరోజు రజనీని పెళ్లి చేసుకోమని శ్రీదేవి అడగగా.. రజనీకాంత్ మాత్రం నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మొఖం మీదే చెప్పేశాడట. అంతటితో ఆగకుండా మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానన్నాడట. దీంతో శ్రీదేవికి పట్టరాని కోపం వచ్చిందట. రజినిని నాతో స్నేహంగా ఉంటూ తన చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటాడని మండిపడిందట. అప్పటి నుంచే రజినీ కాంత్ ను.. శ్రీదేవి దూరం పెట్టేసిందట. ఈ వార్త అప్పట్లో తమిళనాడు మీడియా కొడై కూసింది.
