Rajasekhar : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించిన రాజశేఖర్, ఆ తర్వాత హీరోగా మారి, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని యాంగ్రీ యంగ్ మ్యాన్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అలా కెరీర్ లో చాలా కాలం వరకు అగ్ర కథానాయకుడిగా ఇండస్ట్రీ లో కొనసాగిన రాజశేఖర్ మార్కెట్ ప్రస్తుతం పూర్తిగా డౌన్ అయ్యింది. ఆయనని ఇక జనాలు హీరో గా చూసే పరిస్థితి లేదని అందరికీ అర్థం అయిపోయింది.

జగపతి బాబు మరియు శ్రీకాంత్ లాగా క్యారక్టర్ ఆర్టిస్టుగా మారేందుకు చూస్తున్నాడు కానీ, సరైన క్యారక్టర్ రాకపోవడం తో చాలా సినిమాలు వదులుకుంటూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు ఆయన నితిన్ కొత్త చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం లో ఒక కీలక పాత్ర పోషించడానికి సిద్ధం అయ్యాడు. రీసెంట్ మూవీ టీం ఆయన్ని గ్రాండ్ గా వెల్కమ్ చేస్తూ సోషల్ మీడియా ఒక వీడియో కూడా విడుదల చేసింది.

అయితే ఈ పాత్ర ఫుల్ లెంగ్త్ పాత్ర అనుకుంటే పెద్ద పొరపాటే అట. ఈ క్యారక్టర్ వెండితెర మీద కేవలం రెండు నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. అయితే రాజశేఖర్ కి తన మార్కెట్ మీద ఒక అవగాహనా ఉందో లేదో తెలియదు కానీ, ఈ రెండు నిమిషాల పాత్ర కోసం మూడు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసాడట రాజశేఖర్. ఈ డిమాండ్ ని విన్న నిర్మాతకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది.

అంత ఇచ్చుకోలేము అని చెప్పి రాజశేఖర్ కి పరిస్థితి వివరంగా చెప్పాడట. ముందుగా రాజశేఖర్ ఒప్పుకోలేదు కానీ, ఈ పాత్ర తన సెకండ్ ఇన్నింగ్స్ బాగా ఉపయోగపడుతుందని జీవిత రాజశేఖర్ ని ఒప్పించడం తో, ఆయన చాలా తక్కువ రేట్ కి ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నాడట. మరి ఈ సినిమా ఆయనకీ ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.