Raja Shekar : నితిన్ – శ్రీలీల జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్’. వక్కంతం వంశీ దర్శకుడు. డిసెంబర్ 8న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అందులో రాజశేఖర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే కదా. ముఖ్యంగా ట్రైలర్ చివరలో రాజశేఖర్ చెప్పిన ‘నాకు జీవితం, జీవిత రెండు ఒకటే’ అనే డైలాగ్ ఎంత వైరల్ అయిందో తెలిసిందే.
నిజ జీవితంలో కూడా రాజశేఖర్ అలాగే ఉంటారని చాలామంది అనుకుంటారు. ఇదే విషయంపై రాజశేఖర్ స్పందిస్తూ.. ‘‘సినిమాలో నాకు జీవిత, జీవితం రెండు ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు రాశారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. కానీ అది బాగా వైరల్ అయింది. జీవిత ఏం చెప్తే అది నేను చేస్తాను అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్టున్నాడు. కానీ నిజానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. తను చాలా మంచిది. తిరిగి ఒక్క మాట కూడా అనదు. బయట మాత్రం జీవిత చెప్తేనే నేను వింటాను అని అనుకుంటున్నారు.
నిజానికి జీవిత చెప్పింది కూడా నేను వింటాను. ఎందుకంటే ఆమె ఏం చెప్పినా నా మంచి కోసమే కదా’’ అంటూ తన భార్య జీవిత గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజశేఖర్. ఇక ఇదే ఈవెంట్ లో నితిన్ గురించి మాట్లాడుతూ.. ‘‘నితిన్‌ను బయట చూసి ఆకతాయి కుర్రవాడు అనుకున్నా. సినిమాల్లో ఎక్కువగా ఆ పాత్రలే వేశాడు కదా? అలానే ఉంటాడని అనుకున్నా. కానీ సెట్స్‌లో హీరోగా, నిర్మాతగా అన్నీ ఎంతో బాధ్యతతో చూసుకున్నాడు’’ అని చెప్పారు.