Rajamouli : మహేష్ కోసం హాలీవుడ్ బ్యూటీ ని దింపిన రాజమౌళి..ఆమె ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

- Advertisement -

Rajamouli : మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ ఫ్యాన్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతూ ఉంది.

అతి త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి, ఈ ఏడాది లోనే షూటింగ్ ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు రాజమౌళి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో రకరకాల చర్చలు నడిచిన సంగతి మన అందరికీ తెలిసిందే. ముందు గా ఈ చిత్రం లో దీపికా పదుకొనే నటిస్తుంది అన్నారు.

ఆ తర్వాత ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ రాజమౌళి చర్యలు ఎప్పుడు ఊహాతీతంగానే ఉంటాయి. ఈ సినిమాకోసం ఆయన ఇండియన్ హీరోయిన్స్ జోలికి పోకుండా, ఇండోనేషియా కి సంబంధించిన చెల్సియా ఇస్లాన్ అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారట. రీసెంట్ గానే ఈమెకి సంబంధించిన స్క్రీన్ టెస్ట్ ని కూడా పూర్తి చేశారట. ఈమె ఇప్పటి వరకు పలు హాలీవుడ్ యాక్షన్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

- Advertisement -

అయితే ఈ రాజమౌళి ఈ సినిమాలో ఆమెని హీరోయిన్ పాత్ర కోసం తీసుకుంటున్నారా?, లేకపోతే ఏదైనా చిన్న పాత్ర కోసం తీసుకుంటున్నారా అనేది క్లారిటీ గా తెలియాల్సి ఉంది. ఎందుకంటే హీరోయిన్ పాత్ర కోసం అత్యధిక కాల్ షీట్స్ కావాల్సి ఉంటుంది. ఆమె ఒక్క రోజు కాల్ షీట్ విలువ లక్ష డాలర్లు, రాజమౌళి హీరోయిన్ పాత్ర కోసం అంత ఖర్చు పెడుతాడా అనే అనుమానం ఉంది ఫ్యాన్స్ లో. కానీ ఈ సినిమా కోసం 1500 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు, మరి అంత పెడుతున్నప్పుడు ఆ మాత్రం హీరోయిన్ కి పెట్టలేరా అని అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com