Rajamouli : తెలుగు చిత్ర ఖ్యాతిని గర్వించదగ్గ స్థానానికి తీసుకువెళ్లిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు దర్శకధీరుడు రాజమౌళి. ఎందుకంటే ఆయన ప్రతి సినిమాలోని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనటువంటి స్పెషాలిటీ ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా మంచి సక్సెస్ అందుకోవడానికి కారణం కూడా అదే. ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ.. తెలుగు సినిమా సత్తా చాటుతున్నాయి.

రాజమౌళి గతంలో తెరకెక్కించిన బాహుబలి 1,2, ఆర్‌ఆర్ఆర్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇక రాజమౌళి తన నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో రాజమౌళి కూడా ఒక చిన్న పాత్రలో నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దర్శకత్వంలో జక్కన్నగా సత్తా చాటిన రాజమౌళి ఇప్పటికే కొన్ని సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో మెరిశాడు.

నిజానికి మొదట్లో రాజమౌళి యాక్టర్ కావాలనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడట. కానీ అనుకోకుండా దర్శకుడుగా మారి పాపులారిటీ సంపాదించుకున్నాడు. దీంతో యాక్టర్ గా మారే అవకాశం కూడా ఆయనకు దక్కలేదట. ఇక రాజమౌళి తన సినిమాలోనైనా ఓ కీలక పాత్రలో నటించి తనలోని నటుడి సత్తా ఎంటో చూపాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే తదుపరి మహేష్ బాబుతో తెరకెక్కించబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు కానీ.. అభిమానులకు మాత్రం నిజం అయితే కనుక డబుల్ ఢమాకానే. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.