Rajamouli ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న దిగ్గజ దర్శకుడు. త్వరలోనే ఆయన మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన బాగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. ఒకప్పుడు రాజమౌళి సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండేవాడు కాదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా హిట్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత రాజమౌళి బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల రాజమౌళి ఓ హీరోయిన్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ సినిమా తాజాగా తెలుగులో కూడా రిలీజ్ అయింది. గిరీష్ డైరెక్షన్లో ముస్లిం గపూర్.. మమత బైజు మెయిన్ లీడ్స్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా గురించి రాజమౌళి తనదైన శైలిలో ఓ రివ్యూ ఇచ్చాడు . రివ్యూ తో పాటు తన మనసులోని మాటను కూడా బయటపెట్టాడు.
“ప్రేమలు సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. యూత్ కి తగ్గట్టు మీమ్స్.. యూత్ లాంగ్వేజ్ లో రైటింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ..ట్రైలర్ చూసినప్పటినుంచి ఈ సినిమాలో రీను పాత్రకి నేను ఫ్యాన్ అయిపోయాను.. నాకు బాగా నచ్చేసింది. సచిన్ పాత్ర చేసిన అబ్బాయి కూడా మెప్పించాడు.. కానీ నాకు ఈ సినిమాలో ఆది పాత్ర బాగా నచ్చిందంటూ రివ్యూ ఇచ్చాడు”. ప్రస్తుతం రాజమౌళి రివ్యూ వైరల్ గా మారింది. ఈ సినిమా అభిమానులకు కూడా బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన మమత బైజు తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకుంది.