Rajamouli OscarAcademy : టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దిగ్గజం రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయాలే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. తన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లిన వ్యక్తిగా ఘనత సాధించాడు రాజమౌళి. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాలతో ప్రపంచ నలుమూలుల దృష్టి తెలుగు సినిమాల పై పడే విధంగా చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచలోని ప్రతి మూలకు తీసుకెళ్లారు రాజమౌళి. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డులు కూడా దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న మొదటి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది.

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్ తేజ్ , జూనియర్ ఎన్టీఆర్ లకు ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యులుగా గతంలో ఆహ్వానం అందుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా తాజాగా రాజమౌళి ఆయన సతీమణి రామా రాజమౌళిలకు కూడా ఆస్కార్ అకాడమీలో కొత్త సభ్యులుగా ఆహ్వానం అందింది. దీంతో రాజమౌళికి ఇది నిజమైన ప్రైడ్ మూమెంట్ గా నిలువనుంది. తాజాగా 487 మంది కొత్త సభ్యుల జాబితాను మోషన్ పిక్చర్స్ అండ్ సైన్స్ కేటగిరిని తయారు చేయగా దాంట్లో రాజమౌళి, రామ రాజమౌళి కూడా స్థానాన్ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలో అకాడమీ వారు వీరిద్దరికి ఆహ్వానం పంపించారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ఎస్ఎస్ రాజమౌళి, రామ రాజమౌళితో పాటు ఇతర భారతీయ ఆహ్వానితులలో షబానా అజ్మీర్, రితీష్ సిద్వాని, రవివర్మన్ , రిమాదాస్, సీతల్ శర్మ, ఆనంద్ కుమార్ టక్కరి, షాపౌచ్ హేమల్, త్రివేది గీతేష్ పాండే ఉన్నారు. గత సంవత్సరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎం. ఎం. కీరవాణి, చంద్రబోస్ , కేకే సేంథిల్, సిబు సిరిల్ లాంటి ప్రముఖ టాలీవుడ్ వ్యక్తులకు ఈ ప్రతిష్టాత్మకమైన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ నుంచి ఆహ్వానం లభించింది.