Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి సినీ కెరీర్ ఎలా మొదలైందో మన అందరికీ తెలిసిందే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంతో కాలం పని చేసిన రాజమౌళి, ఆ తర్వాత శాంతినివాసం అనే టీవీ సీరియల్ ద్వారా డైరెక్టర్ గా మారాడు. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ నచ్చి రాఘవేంద్ర రావు అయన సొంత నిర్మాణ సంస్థలో స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చాడు.

ఈ చిత్రం తర్వాత రాజమౌళి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు అనే చెప్పాలి. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ బాహుబలి, #RRR వంటి వెండితెర అద్భుతాలు చూసి ఆస్కార్ అవార్డుని గెలుచుకునే రేంజ్ కి ఎదిగాడు. ఇదంతా పక్కన పెడితే రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభమై, బడ్జెట్ లేక మధ్యలో ఒక్క సినిమా ఆగిపోయింది అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మి తీరాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి.

అప్పట్లో రాఘవేంద్ర రావు తన కొడుకు ప్రకాష్ ని ‘నీతో’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి లాంచ్ చేసాడు. ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ చిత్రం తర్వాత రెండవ సినిమా రాజమౌళి తో చెయ్యాలి. గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు ప్రారంభించి షూటింగ్ మొదలు పెట్టారు. ఒక షెడ్యూల్ పూర్తి అయినా తర్వాత ఫైనాన్షియర్స్ ఈ సినిమాకి డబ్బులు పెట్టడానికి ధైర్యం చెయ్యలేదు.

ఎందుకంటే ప్రకాష్ కి అసలు యాక్టింగ్ రావడం లేదు, కనీసం డ్యాన్స్, ఫైట్స్ అయినా చేస్తాడా అనుకుంటే అందులో కూడా మ్యానేజ్ చేయలేకపోతున్నాడు. రాజమౌళి టాలెంట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా ప్రకాష్ మీద నమ్మకం లేక దూరం జరిగారు. అలా వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న రాజమౌళి కెరీర్ లో ఒక సినిమా షూటింగ్ ని ప్రారంభించుకొని మధ్యలోనే ఆగిపోయిన సందర్భం ఉంది అన్నమాట.
