Rajamouli : దట్ ఈజ్ రాజమౌళి.. మహేశ్ కోసం ఏకంగా ఇండోనేషియన్ భామ

- Advertisement -


Rajamouli : రాజమౌళి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయను మించినోళ్లు లేరు. దర్శకధీరుడుగా ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని దర్శకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్. ఆయన ఏ సినిమా చేసినా అది ఓ సంచలనమే. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన రేంజ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయన క్రేజ్ పెరిగింది. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో తెలిసిందే. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత.. రాజమౌళి – మహేష్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Rajamouli :
Rajamouli :

ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తయిపోయింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. ఇదే క్రమంలో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేశారన్న దానిపై సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎవరికి వారు ఆ హీరోయినే అంటూ వాళ్లకు వాళ్లు డిసైడ్ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి స్టార్ బ్యూటీల పేర్లు వినిపించాయి.

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా కోసం ఇండోనేషియాకు చెందిన ఓ హీరోయిన్ ను రంగంలోకి దించుతున్నాడట రాజమౌళి. ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో న‌టించింది. తాజాగా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని ప్రచారం జరుగుతోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీల‌క పాత్ర కోసం తీసుకొన్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే ఇప్పటివరకు ఏ డైరెక్టర్ చేయని సాహసం రాజమౌళి చేస్తున్నట్లే. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here