Rajamouli : #RRR వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని ఎప్పుడో అధికారికంగా ప్రకటించేశాడు. గత ఏడాది నుండి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. రాజమౌళి కి పలు వెర్షన్స్ వినిపించాడు కానీ, ఎందుకో ఆయన నూటికి నూరు శాతం సంతృప్తి చెందలేదు. దీంతో విజయేంద్ర ప్రసాద్ మళ్ళీ రీ వర్క్ చెయ్యడం ప్రారంభించాడు.

రాజమౌళి అభిరుచి కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తున్నాడు. సినిమా కార్యరూపం దాల్చి సెట్స్ మీదకు వెళ్ళడానికి మరో ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోపు రాజమౌళి రవితేజ తో ‘విక్రమార్కుడు’ సీక్వెల్ చేయబోతున్నాడని గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక టాక్ వినిపించింది. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ కి కావాల్సిన సబ్జెక్టు విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో సిద్ధం చేసాడు.

ఈ చిత్రం రాజమౌళి తో కాకుండా వేరే డైరెక్టర్ తో తీస్తామని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు, కానీ ఇప్పుడు కావాల్సినంత సమయం దొరకడం తో ఈ విక్రమార్కుడు మూవీ సీక్వెల్ ని తానే డీల్ చేస్తాను అన్నట్టుగా రాజమౌళి చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం రవితేజ అక్టోబర్ 20 వ తారీఖున విడుదల అవ్వబొయ్యే ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.

తెలుగు లో కంటే కూడా ఆయన ఎక్కువగా హిందీ మార్కెట్ మీదనే ఫోకస్ పెట్టాడు. హిందీ ప్రొమోషన్స్ లో విక్రమార్కుడు 2 గురించి వచ్చిన వార్తల గురించి రవితేజ స్పందిస్తూ ‘రాజమౌళి లాంటి దర్శకుడితో పని చేసే అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటాను, విక్రమార్కుడు 2 చిత్రం గురించి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ రాలేదు. ఒకవేళ రాజమౌళి చేద్దాం అంటే తప్పకుండా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు రవితేజ.