Raj Tarun – Lavanya : గత కొద్దిరోజులుగా మీడియా లో రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు లావణ్య రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా గురించి ఎదో ఒక విషయం బయట పెడుతూనే ఉంది. తనకి డబ్బు ఏమి వద్దని, రాజ్ తరుణ్ మాత్రమే కావాలి అంటూ ఆమె చేస్తున్న ఈ పోరాటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత మొండిపట్టు పట్టిన ఒక అమ్మాయిని బహుశా ఇప్పటి వరకు మనం ఎక్కడా చూసి ఉండమేమో. ఈమెకి మద్దతుగా జనసేన పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుతం హై కోర్ట్ లో లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న కళ్యాణ్ దిలీప్ సుంకర నిలిచాడు. లావణ్య తరుపున ఆయన వాదిస్తూ, రాజ్ తరుణ్ లావణ్య ని స్వీకరించకపోతే జైలు పాలయ్యేలా చేస్తానని కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియా ముఖంగా పలు మార్లు తెలిపాడు.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన సంచలనంగా మారింది. నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ లేఖ రాసి పోలీసులకు పంపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే లావణ్య ఇంటికి వెళ్లి ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంటుండగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమెకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఆ సమయం లో ఆమె ‘రాజ్ తరుణ్ లేని జీవితం నాకు వద్దు. తనే నా ప్రపంచం. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. నా చావుని కోరుకుంటున్నాడు. అతను ఆ విధంగా మారిపోవడానికి కారణం మాల్వీ మల్హోత్రానే.
ఈ విషయం లో నాతో పాటు ఉండే సన్నిహితులు కూడా నన్ను అపార్థం చేసుకోవడం తట్టుకోలేకపోతున్నాను. నాకు నిజంగా బ్రతకాలని లేదు’ అంటూ వెక్కిళ్లు పెట్టి ఏడ్చిందట. ఆమె పరిస్థితి చూస్తుంటే రాజ్ తరుణ్ ని ఎట్టిపరిస్థితిలో కూడా వదులుకునేలా లేదు. అటు పక్క రాజ్ తరుణ్ మాత్రం, ఆమె బ్రతికేందుకు కావాల్సినంత ఆర్థిక సహాయం చేస్తాను, కానీ ఆమెని నా భార్య గా ససేమీరా అంగీకరించను అని భీష్మించి కూర్చున్నాడు. లావణ్య కూడా రాజ్ తరుణ్ ని ఎట్టిపరిస్థితిలో వదులుకునేలా లేదు. ఇక కేసు ఎటు వెళ్తుందో రాబొయ్యే రోజుల్లో, ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.