Raj Tarun and Lavanya : హీరో రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది.. ఆయన ప్రేయసి లావణ్య పెట్టిన కేసులో ట్విస్ట్ లు మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. రాజ్ తరుణ్ నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తుంది. ఇక అందులో భాగంగానే ఇతడు రహస్యంగా అక్రమ సంబంధం నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రూవ్ చేసింది కూడా. ముఖ్యంగా రాజ్ తరుణ్ – లావణ్య – మాల్వి మల్హోత్రాల మధ్య కేసుల వ్యవహారం తారాస్థాయికి చేరింది.తాజాగా రాజ్ తరుణ్ మల్హోత్రా మెసేజ్ చాట్ లీక్ అయింది.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది..
ఆ లీకైన చాట్ లో.. 2023లో రాజ్ తరుణ్.. మాల్వీ మల్హోత్రాకు లవ్ ప్రపోజ్ చేశాడు. రాజ్ తరుణ్ నుండి వచ్చిన ప్రపోసల్ కు ఆమె కూడా వెంటనే యాక్సెప్ట్ చేసినట్టు మెసేజ్ పెట్టింది.. అనేకసార్లు రాజ్ తరుణ్ కు మాల్వీ హోటల్స్ కూడా బుక్ చేసింది.. ప్రతిసారి కూడా కోయంబత్తూర్ లోని మాధవ హోటల్లో వీరిద్దరూ కలిసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయట. అలాగే వీరిద్దరూ వీడియో కాల్స్ తో పాటుగా రొమాంటిక్ విషయాలను కూడా ఆ చాట్ లో చేసేవారని తెలుస్తుంది.. ఈ చాట్ ను బట్టి చూస్తే లావణ్య చేసిన ఆరోపణలు నిజమేనని తెలుస్తుంది..
ఇకపోతే లావణ్య పెట్టిన కేసులో రాజ్ తరుణ్ కి నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. 18వ తేదీలోగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.. కానీ రాజ్ తరుణ్ చిత్రాల షూటింగ్స్ , బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని తన లాయర్ ద్వారా సమాచారాన్ని చేరవేశాడు. అంతే కాదు విచారణకు హాజరయ్యేందుకు మరికొన్ని రోజుల గడువు కావాలని ఒక లేఖలో రాసి పోలీసులను కోరినట్లు తెలిసింది.. మరి ఇప్పుడు చాట్ లీక్ అవ్వడంతో లావణ్యకు మద్దతు కూడా పెరిగినట్లు తెలుస్తుంది. ఈ కేసు ఎంతవరకు వెళుతుందో .. రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడో చూడాలి..