Ariyana Gloryతో రాజ్ తరుణ్ ఎఫైర్..ఆధారాలతో సహా బయటపెట్టిన లావణ్య!

- Advertisement -

Ariyana Glory గత రెండు రోజుల నుండి ప్రముఖ హీరో రాజ్ తరుణ్, లావణ్యాల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియా లో ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ మాయలో పడి నన్ను వదిలేసాడని, తనని శారీరకంగా అన్నీ విధాలుగా వాడుకొని, పెళ్లి కూడా చేసుకొని ఇప్పుడు వదిలించుకోడానికి ప్రయత్నం చేస్తున్నాడని, నాకు మీరే న్యాయం చెయ్యాలి అంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. దీనిపై రాజ్ తరుణ్ స్పందిస్తూ తనతో రిలేషన్ లో ఉన్న విషయం వాస్తవమేనని, కానీ ఆమెకు ఉన్న చెడు స్నేహాలు, చెడు అలవాట్లు కారణంగా తనని 2017 వ సంవత్సరం నుండి వదిలేసానని, ఆమెకి డ్రగ్స్ వాడే అలవాట్లు ఉన్నాయని, కేసు కూడా నమోదు అయ్యిందని చెప్పుకొచ్చాడు.

Raj Tarun to Take Legal Action Against Ex-Lover Lavanya

దీంతో లావణ్య పై సోషల్ మీడియా లో నెటిజెన్స్ లో వ్యతిరేకత ఎదురై, రాజ్ తరుణ్ కి సపోర్టు బాగా పెరిగిపోయింది. అయితే నేడు లావణ్య మీడియా ముందుకు వచ్చి చేసిన కొన్ని కామెంట్లు పెను దుమారం రేపాయి. రాజ్ తరుణ్ కి కేవలం ఒక్క హీరోయిన్ తో కాదు, ఎంతోమంది హీరోయిన్స్ తో అఫైర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది. అలాగే బిగ్ బాస్ బ్యూటీ అరియానా తో కూడా రాజ్ తరుణ్ ఎఫైర్ నడిపాడు అంటూ ఆమె మరో బాంబు పేల్చింది. అరియానా తో రాజ్ తరుణ్ కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసాడని, అది కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే అని, ఆ ఒక్క రోజు పరిచయం తో రాజ్ తరుణ్, అరియనా ప్రతీ రోజు ఫోన్లో మాట్లాడుకునేవారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Raj Tarun Faces Infidelity Allegations From Partner Lavanya - Oneindia News

తానూ కోచింగ్ కోసం మూడు నెలలు బెంగళూరు కి వెళ్ళినప్పుడు అరియనా తో రాజ్ తరుణ్ బాగా తిరిగేవాడని, ప్రముఖ నటుడు రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి, మీ వాడిని అలా వదిలేసి వెళ్లిపోయావేంటి, అతన్ని అలాగే వదిలితే నీకు త్వరలోనే అన్యాయం జరిగే ప్రమాదం ఉంది అని హెచ్చరించడం తో వెంటనే కోచింగ్ మధ్యలో వదిలి వచేసానని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ మిమ్మల్ని ఇంతలా బాధపెట్టాడు అంటున్నారు కదా, కానీ ఇప్పటికీ ఆయననే మీరు కోరుకుంటున్నారు ఎందుకు అని విలేఖరులు అడగగా, దానికి లావణ్య సమాధానం చెప్తూ నాకు అతను అంటే ఇష్టం, అందుకే ఇంతలా న్యాయం కోసం పోరాడుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Ariyana Glory
Ariyana Glory
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here