Raj Tarun – lavanya : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పేరు ఇప్పుడు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.. తన మాజీ ప్రేయసి లావణ్య పెట్టిన చీటింగ్ కేసు వల్ల రాజ్ తరుణ్ అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.. లావణ్య రాజ్ తరుణ్ మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయట పడింది.. ఈ రోజు ఈ కేసులో నమ్మలేని విషయాలు బయట పడ్డాయి.. తాజాగా రాజ్ తరుణ్ టీం లావణ్య కు ఫోన్ చేసి డబ్బులను ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది..
రాజ్ తరుణ్ పై మాజీ ప్రేయసి లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 2008లో సోషల్ మీడియా వేదికగా మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. 2014లో రాజ్ తరుణ్ నన్ను వివాహం చేసుకున్నాడు.. అంతేకాదు రెండు సార్లు అబార్షన్ కూడా చేయించినట్లు ఆరోపించింది.. అందుకు సంబంధించిన బిల్లును కూడా లావణ్య పోలీసులకు సమర్పించారు.. మొత్తంగా చూసుకుంటే రాజ్ తరుణ్ చుట్టు ఉచ్చు బిగించినట్లు తెలుస్తుంది…
రోజురోజుకు ఈ కేసు కీలకంగా మారుతుంది.. దీంతో రాజ్ తరుణ్ కాళ్ళబేరానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. రాజ్ తరుణ్ తరపున తనకు రెండు ఫోన్ కాల్స్ వచ్చినట్లు లావణ్య చెబుతున్నారు. మొదట రాజ్ తరుణ్ మేనేజర్ ఫోన్ చేశాడట. అనంతరం ఆయన లాయర్ కాల్ చేసి లావణ్యతో మాట్లాడట. రూ. 5 కోట్లు ఇచ్చిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒప్పుకున్నారు.. కానీ ఆమె చెప్పుకోలేదని.. అయితే ఫ్లాప్ హీరో దగ్గర అంత డబ్బులు ఎలా వచ్చాయనే చర్చ మొదలైంది.. మరి ఈ కేసు ఎన్నిమలుపులు తిరుగుతుందో…