Raj Tarun : రాజ్ తరుణ్, లావణ్య చౌదరి ప్రేమ వ్యవహారం మీడియా లో గత కొంతకాలంగా ఎంత హాట్ టాపిక్ గా మారిందో మన అందరికీ తెలిసిందే. రకరకాల ట్విస్టులతో వీళ్లిద్దరి వ్యవహారం నెటిజెన్స్ కి పిచ్చెక్కించేసారు. రోజు మాకు ఇదేమి గోలరా బాబు అని ఎంతోమంది తలలు కొట్టుకున్నారు. అయితే లావణ్య రాజ్ తరుణ్ పై ఆరోపణలు చేస్తూ, పలు ఆధారాలను పోలీసులకు అప్పగిస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ కంప్లైంట్ పట్ల విచారణ కి రావాల్సిందిగా పోలీసులు ఉత్తర్వులు జారీ చేసారు. నేడు రాజ్ తరుణ్ విచారణకి రావాల్సి ఉండగా, ఆయన తాను రాలేనని తన లాయర్ చేత కబురు పంపించాడు. అయితే పోలీసులు దీనిపై చాలా సీరియస్ అయ్యినట్టు తెలుస్తుంది.
రాజ్ తరుణ్ కి హెచ్చరింపు గా ఉత్తర్వులు తయారు చేసి పంపేందుకు నార్సింగి పోలీసులు సిద్ధంగా ఉన్నారట. మరోసారి కూడా పోలీసులు చెప్పిన తేదీలో విచారణకు రాకపోతే అరెస్ట్ చేసేందుకు చర్యలు సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా తో కలిసి రహస్యంగా ఎక్కడో ఉంటున్నాడట. మొన్నటి వరకు మీడియా కి అందుబాటులో ఉన్న వీళ్లిద్దరు, ఇప్పుడు మీడియా కి దూరంగా ఉంటున్నారు. వీళ్లిద్దరు కలిసి ‘తిరగబడరసామీ’ అనే చిత్రం లో హీరో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రీసెంట్ గానే విడుదలైంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ప్రస్తుతం వీళ్లిద్దరు మంచి ట్రెండింగ్ లో ఉన్న సెలబ్రిటీస్ కావడంతో వాళ్ళ పాపులారిటీ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం లో భాగంగానే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా రాజ్ తరుణ్ హీరో గా నటించిన మరో చిత్రం ‘పురుషోత్తముడు’ ఈ నెల 27 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి తన ఇంస్టాగ్రామ్ లో అకౌంట్ ట్వీట్ కూడా వేసాడు రాజ్ తరుణ్. ప్రొమోషన్స్ లో కూడా ఆయన కేవలం ఆన్లైన్ లోనే చేస్తాడని, ఎలాంటి ఇంటర్వూస్ కూడా ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాబొయ్యే బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొంటాడని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది దాదాపుగా అసాధ్యం అని అనుకోవచ్చు.