Radhika Apte : అక్కడ మగాళ్లదే రాజ్యం.. వాళ్లు ఎలా చెబితే అలా చేయాల్సిందే.. ఆవేదన వ్యక్తం చేసిన స్టార్ హీరోయిన్

- Advertisement -


Radhika Apte : టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ముద్దుగుమ్మ రాధికా ఆప్టే. రక్త చరిత్ర, రజనీకాంత్ కబాలి, బాలకృష్ణ లెజెండ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ పలు తెలుగు వెబ్ సిరీస్‌లలో తన అందాలతో మెస్మరైజ్ చేసింది. తన అద్భుత నటనతో ఆకట్టుకున్న రాధిక.. స్త్రీ స్వేచ్ఛ, పురుషాధిక్యంపై స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు హేతుబద్ధ విషయాలపై, మహిళా సంక్షేమంపై పోరాడుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కావడంతో ఎప్పటికప్పుడు పలు వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ బ్యూటీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

Radhika Apte
Radhika Apte

ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఇంటర్వ్యూలో రాధిక తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. రాధికా ఆప్టే మాట్లాడుతూ.. టాలీవుడ్‌లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఆ పరిశ్రమ చాలా పెత్తందారీ, పురుషాధిక్య పరిశ్రమ.. అసలు తట్టుకోలేం.. ఆడవాళ్ల పట్ల వ్యవహరిస్తున్న తీరు, సినిమాల్లో వాళ్ల పాత్రలకు ఇచ్చే ప్రాముఖ్యత చాలా బలహీనంగా ఉంది.. సెట్లో మమ్మల్ని మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారని చెప్పుకొచ్చారు.

Radhika Apte Comments

ఇతర నటీనటులు ఎవరిని అడగకుండా.. వారి ఫిజికల్ స్టేటస్ బట్టి షూటింగ్ ఎప్పటికప్పుడు రద్దు చేస్తూ ఉంటారు. ఈ కారణంగా నేను చాలా ఇబ్బందులు ఎదురొన్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో సోషల్ మీడియాలో టాలీవుడ్ అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. రాధిక ఆప్టే కొన్నాళ్ల క్రితం రాజీవ్ మా ఆనంద్ మ‌సంద్‌తో ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించగా.. వాటిపై అప్పట్లో బోలెడంత చర్చ జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ క్లిప్ ని వైరల్ చేస్తూ ఆమె ఇటీవల కాలంలో నటించిన బోల్డ్ సన్నివేశాలను, ఇంటిమేట్ సీన్ల వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ఇలాంటి ఆమె తెలుగు పరిశ్రమ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుందా అని తిట్టిపోస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here