Ram Charan : #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గ్లోబల్ రేంజ్ లో స్టార్ స్టేటస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతకు ముందే ఆయన నటుడిగా మరియు బాక్స్ ఆఫీస్ పరంగా తన రేంజ్ ఏమిటి అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ‘మగధీర’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి, ఆ తర్వాత రచ్చ , నాయక్ , ఎవడు లాంటి మామూలు యావరేజి సినిమాలను కూడా పెద్ద బ్లాక్ బస్టర్స్ ని చేసిన స్టార్ ఆయన. ఒకే మూస సినిమాలు చేస్తున్నాడు అంటూ వచ్చే కామెంట్స్ మొత్తం రంగస్థలం సినిమాతో కొట్టుకుపోయాయి.
ఈ చిత్రం లో ఆయన గత రెండు దశాబ్దాలలో ఏ స్టార్ హీరో కూడా నటించలేనంత గొప్పగా నటించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన #RRR లో అల్లూరి సీతారామరాజు పాత్ర ద్వారా మరోసారి అద్భుతంగా నటించి ప్రపంచం లో ఉన్న సినీ అభిమానులు మొత్తం పొగడ్తల వర్షం కురిపించుకున్నాడు.
ఆయనకీ ఏ రేంజ్ లో క్రేజ్ పెరిగింది అనే దానికి రీసెంట్ గా ఒక ఉదాహరణ దొరికింది. కాంపిటీటివ్ పరీక్షల్లో ఉండే కరంట్ అఫైర్స్ విభాగం లో రామ్ చరణ్ ఢిల్లీ లో నిర్వహించిన జీ – 20 సమ్మిట్ మీటింగ్ లో డెలిగేట్స్ కలిసి మీటింగ్ లో పాల్గొనడం గురించి ఒక ప్రశ్న అడిగారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇది మా అభిమాన హీరో రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
కేవలం ఇదొక్కటే కాదు, రామ్ చరణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన ‘రంగస్థలం’ చిత్రం ఇటీవలే జపాన్ లో విడుదలై గ్రాండ్ గా విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఇప్పటి వరకు ఆ చిత్రం అక్కడ 50 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ తో పాటుగా గ్లోబల్ స్టార్స్ ఇమేజి దక్కించుకున్న ఎన్టీఆర్, ప్రభాస్ లు కూడా ఇటీవల కాలం లో జపాన్ లో తమ సినిమాలను రిలీజ్ చేసుకున్నారు కానీ, ఆశించిన స్థాయి ఫలితాలను రాబట్టలేకపొయ్యారు. దీనిని బట్టి తెలుగు హీరోల్లో రామ్ చరణ్ కి ఎక్కువగా గ్లోబల్ క్రేజ్ ఉండనే విషయం అర్థం అవుతుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.