Vijay Devarakonda ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇంత దూరం రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా నైజాం, నార్త్ ఇండియా లో విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ కొంతమంది స్టార్ హీరోలకు కూడా లేదనడంలో అతిశయోక్తి లేదేమో.

ముఖ్యంగా అమ్మాయిలు విజయ్ దేవరకొండ అంటే పడి చచ్చిపోతుంటారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ మొత్తానికి విజయ్ దేవరకొండ అంటే క్రష్. అమ్మాయిలలో ఇతనికి ఉన్న ఫాలోయింగ్ చూసి స్టార్స్ కి సైతం అసూయ కలుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన పీవీ సింధు రీసెంట్ గా విజయ్ దేవరకొండ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘బ్యాడ్మింటన్ ఆడి బాగా ఒత్తిడికి గురయ్యే నేను , కాస్త రిలాక్స్ అవ్వడం కోసం సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటాను. కొత్త సినిమానా?, లేదా పాత సినిమానా అనే వ్యత్యాసం ఉండదు, ప్రతీ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తాను. నాకు బాగా ఇష్టమైన హీరో ప్రభాస్. అతని నటన చాలా సహజంగా ఉంటుంది. దాదాపుగా ఆయనవి అన్నీ సినిమాలు చూసేసాను. ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ సినిమాలంటే కూడా బాగా ఇష్టం, నాకు ఒలంపిక్స్ లో మెడల్ వచ్చినప్పుడు చిరంజీవి గారు తన ఇంటికి నన్ను పిలిచి సత్కరించారు. ఆ సందర్భాన్ని నేను జీవితం లో మర్చిపోలేను. ఎన్టీఆర్ సినిమాలు కూడా బాగుంటాయి, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చాలానే చూసాను కానీ, ఎందుకో నాకు అతను అంతగా నచ్చలేదు’ అంటూ పీవీ సింధు షాకింగ్ కామెంట్స్ చేసింది.
