Pushpa 2 : పుష్ప గాడు గట్టిగా కొట్టేశాడుగా.. దెబ్బకు బాలీవుడ్ సైతం బెంబేలెత్తిపోయింది

- Advertisement -

Pushpa 2 : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2 ది రూల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షరవేగంగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ తో అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక తాజాగా పుష్ప 2 నార్త్ ఇండియా హిందీ రైట్స్ ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏఏ ఫిలిమ్స్ అధినేత అనిల్ తడానీ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఈ మూవీ రైట్స్ ని అనిల్ అడ్వాన్స్ బేసిస్ లో ఏకంగా రూ. 200 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారట. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం కూడా క్లిప్‌లో డైలాగ్ లేదు. కేవలం జాతర లుక్‌ని చూపించారు. అది సినిమాలో ముఖ్యమైన భాగం కానుంది. త్వరలోనే మరో టీజర్‌ని తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

pushpa 2 teaser

సౌత్ లోనే కాకుండా హిందీ బెల్ట్ లో కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అని అంటున్నారు. దీని ప్రకారం ‘పుష్ప: ది రూల్’ హిందీ థియేట్రికల్ రైట్స్ డీల్ ఖాయమైంది. ఇది రికార్డ్ డీల్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ‘పుష్ప 2’ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ని అనిల్ తడాని కొనుగోలు చేశారు. ఈ ఏడాది అందరూ ఎదురుచూస్తున్న సినిమా ఇదే. సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 200 కోట్లకు వీటిని విక్రయించినట్లు సమాచారం.

- Advertisement -

నార్త్ ఇండియాలో ఇదే అతిపెద్ద థియేట్రికల్ డీల్. ఇది కోవిడ్‌కి ముందు వచ్చిన అతి పెద్ద ఫీచర్ ఫిల్మ్‌ల కంటే కూడా ఎక్కువ. గతంలో షారుఖ్ ఖాన్ జవాన్ రూ. 150 కోట్లకు అమ్ముడవగా దానిని కూడా మించి దిమ్మతిరిగే ధరకు పుష్ప 2 అమ్ముడవడంతో అక్కడ ఈ మూవీకి ఆడియన్స్ లో ఎంత హైప్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. కాగా సేఫ్ జోన్ లోకి రావాలంటే పుష్ప 2 మూవీ హిందీ బెల్ట్ లో మొత్తంగా రూ. 400 కోట్లు రాబట్టాలి. మరి పుష్ప 2 మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి. ‘పుష్ప 2’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 100 కోట్లకు కొనుగోలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here