Puri Jagannadh : మన టాలీవుడ్ కి హీరోయిజం విషయం లో సరికొత్త నిర్వచనం తెలిపిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పూరి జగన్నాథ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బద్రి’ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు, చాలా డిఫరెంట్ హీరోయిజం చూపించాడు అనే అనుభూతిని పొందారు.
ఈ సినిమా తర్వాత ఆయన దాదాపుగా అన్నీ సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్ ని అలాగే రాసుకుంటూ వచ్చాడు. అవి సెన్సేషన్ సృష్టించాయి. కానీ పోకిరి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ కొట్టిన హిట్స్ ఎన్ని అనేవి చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. ఎప్పుడో అమావాస్యకో, పౌర్ణమికో ఒక హిట్ కొడుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడైతే హీరోయిన్ ఛార్మీ ఇతగాడి జీవితం లోకి అడుగుపెట్టిందో, అప్పటి నుండి గడ్డు కాలం మొదలైంది అనే చెప్పాలి.
వీళ్లిద్దరు సంయుక్తంగా కలిసి నిర్మించిన సినిమాలలో కేవలం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ఒక్కటే భారీ హిట్ అయ్యింది. మిగిలిన సినిమాలన్నీ కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి కారణంగా ఒక్క హీరోయిన్ జీవితం సర్వనాశనం అయ్యిందని ఇండస్ట్రీ లో ఒక టాక్ ఉండేది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ముమైత్ ఖాన్. ఒకప్పుడు ముమైత్ ఖాన్ లేనిదే పూరి జగన్నాథ్ సినిమా ఉండేది కాదు. 143 అనే చిత్రం ద్వారా ప్రారంభమైన వీళ్లిద్దరి జర్నీ, పోకిరి సినిమాతో తారాస్థాయికి చేరింది.
అలా ఇద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం కూడా ఏర్పడింది . అప్పట్లో ముమైత్ ఖాన్ పూరిజగన్నాథ్ ఇంట్లోనే ఉండేదట. స్వయంగా పూరి జగన్నాథ్ భార్య ముమైత్ ఖాన్ కి ప్రేమతో ముద్దలు కలిపి నోట్లో అన్నం పెట్టేదట. అలాంటి బంధం ఛార్మీ కారణంగా తెగిపోయిందని, అప్పటి నుండి పూరి జగన్నాథ్ సినిమాల్లో ముమైత్ ఖాన్ కి అవకాశాలు రాలేదని, ఆమె కెరీర్ అలా ముగిసిపోయిందని ఇండస్ట్రీలో ఎప్పటి నుండో సాగుతున్న చర్చ.