Kiara Advani ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక్కొక్కరిగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు అయినా సిద్ధార్థ మల్హోత్రా కియారా అద్వానీ లు పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఎప్పటినుండో వీరిపై పెళ్లి వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ చివరికి పెళ్లి డేట్ షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.. వివాహ బంధంతో ఒకటైయ్యారు.. అయితే వీరిద్దరూ అంత సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం వేరే ఉందని ఓ వార్త వినిపిస్తుంది.. కియారా ప్రగ్నెంట్ కావడంతోనే పెళ్లి చేసుకుందని బాలివుడ్ నిర్మాత కమల్ రషీద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది..

కేఆర్ కే తరచూ సెలబ్రిటీల మీద ఏదో ఒక నింద వేస్తూ వారిపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటికే ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు కూడా. అయినప్పటికీ భయపడకుండా ఎప్పటికప్పుడు సెలబ్రిటీలపై విమర్శలు చేస్తూ వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అంతేకాదు తాను సినీ క్రిటిక్ అని కూడా తనకు తానే ఫీల్ అవుతాడు. అలాగే కొత్తగా ఏవైనా సినిమాలు వస్తే వాటిపై కూడా రివ్యూ లు ఇస్తూ ఉంటాడు.. అయితే.. తాజాగా బాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త రకం ట్రెండ్ నడుస్తుంది అంటూ చెప్పి షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే… ప్రస్తుతం బాలీవుడ్ లో న్యూ ట్రెండ్ నడుస్తోంది.ఫస్ట్ ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాతే పెళ్లి..అనే ట్రెండు బాలీవుడ్ లో నడుస్తోంది.

అంతే కాదు తాజాగా పెళ్లి చేసుకున్న కొత్తజంట కూడా ఇదే ఫార్ములా ని ఫాలో అయ్యారు అంటూ వ్యాఖ్యలు చేశారు.. కొత్తజంట అంటే కియార అద్వాని సిద్ధార్థ్ మల్హోత్రలే జంటే కదా అని చాలామంది భావిస్తున్నారు.. అంటే కియారా పెళ్లికి ముందే ప్రెగ్నెంటా..అందుకే సిద్ధార్థ్ మల్హోత్రతో తొందర పెళ్లి చేసుకుందా అని భావిస్తున్నారు. నిజంగా కే ఆర్ కే వీరి గురించి చెప్పాడా లేక వేరే ఎవరినైనా ఉద్దేశించి చెప్పాడా అని కామెంట్లు పెడుతున్నారు.. ఇక ఈ విషయం పై కొత్త పెళ్లి కూతురు కియారా ఎలా స్పందిస్తుందో చూడాలి..