టాలీవుడ్ లో డ్రగ్ మాఫియా నడవడం అనేది కొత్త కాదు. ఎంతో మంది సెలెబ్రిటీలు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిన సందర్భాలు ఉన్నాయి. అందులో కొంతమంది ప్రముఖ స్టార్ దర్శకులు, నిర్మాతలు, హీరోలు మరియు హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే రాజకీయ కనెక్షన్స్ ఉన్న హీరోల సెలెబ్రిటీల పేర్లు బయటకి రాలేదు కానీ, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేని సెలెబ్రిటీలు మాత్రం దొరికిపోయారు.

ఇప్పుడు రీసెంట్ గా ప్రముఖ నిర్మాత KP చౌదరి డ్రగ్స్ ని సరఫరా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. గోవా నుండి వంద ప్యాకెట్స్ ని తీసుకొని ఏప్రిల్ లో హైదరాబాద్ కి వచ్చిన KP చౌదరి, ఇక్కడ టాలీవుడ్ సెలెబ్రెటీలకు డ్రగ్స్ ని సరఫరా చేస్తున్నాడు. ఇక గోవా లో ఈయనకి OHM క్లబ్స్ కూడా ఉన్నాయి. ఇతనితో సన్నిహితంగా ఉండే టాలీవుడ్ సెలెబ్రిటీలను కూడా విచారించనున్నారు SIT అధికారులు.

KP చౌదరీ రీసెంట్ సమయం లో సురేఖ వాణి, రాజా రవీంద్ర వంటి సినీ ప్రముఖులతో దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. అంటే వీళ్ళు కూడా KP చౌదరి దగ్గర ఇన్ని రోజులు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారా అనే సందేహాలు ఇప్పుడు తలెత్తాయి. సురేఖ వాణి తరచూ ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉండడం , ఇవన్నీ చూస్తూ ఉంటే ఈమె కచ్చితంగా చౌదరి దగ్గర డ్రగ్స్ విక్రయించి ఉంటుందని అంటున్నారు నెటిజెన్స్.

ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే విచారణ ముగిసే వరకు వేచి చూడక తప్పదు. KP చౌదరి సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘కబాలి’ వంటి సినిమాలను నిర్మించాడు. అంత సూపర్ స్టార్ తో సినిమాని నిర్మించిన KP చౌదరి ఇలాంటి పనులు చెయ్యడం సిగ్గు చేటు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పట్టుబడిన డ్రగ్స్ యొక్క విలువ 78 లక్షల వరకు ఉంటుందని అంచనా.