Bandla Ganesh : ప్రముఖ కమెడియన్,సినీ నిర్మాత బండ్ల గణేష్ కి ఒంగోలు కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు కాసేపటి క్రితమే తీర్పుని ఇచ్చింది. అంతే 95 లక్షల రూపాయిలు జరిమానా కూడా కట్టాలట. జెట్టి వెంకటేశ్వరులు అనే వ్యక్తికీ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పేరుతో ఇచ్చిన చెక్ బౌన్స్ కావడం తో అతను కోర్టులో కేసు వేసాడు. గత కొంతకాలం నుండి కోర్టులో విచారణ జరుపుకుంటున్న ఈ కేసుకి నేడు తుది తీర్పుని ఇచ్చారు.

ఈ తీర్పు ని అప్పీల్ చేసుకునేందుకు బండ్ల గణేష్ కి నెల రోజులు గడువుని ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చింది. దీంతో బండ్ల గణేష్ ఇప్పుడు ఏమి చెయ్యాలో తోచక టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ అరెస్ట్ అయ్యినప్పటికీ ఆయన బెయిల్ మీద బయటకి రావొచ్చు కానీ, సినీ ఇండస్ట్రీ లో ఎన్నో లావాదేవీలు చేసిన బండ్ల గణేష్ ఇంత చిన్న విషయం లో జైలు మెట్లు ఎక్కబోతుండడం ఆయన కుటుంబానికి కాస్త బాధ కలిగించే విషయం అనే చెప్పాలి.

ఇక బండ్ల గణేష్ సినిమాల విషయానికి వస్తే, ఒకానొక దశలో వరుసగా స్టార్ హీరోలను పెట్టి సినిమాలను నిర్మిస్తూ వచ్చిన ఆయన, ఇప్పుడు సినెమాల నిర్మాణం కి దూరం గా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దేవుడిగా భావించే పవన్ కళ్యాణ్ కూడా బండ్ల గణేష్ ని ఈమధ్య కాలం లో దూరం పెట్టేసాడు. మొదటి సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ కూడా పట్టించుకోవడం లేదు.

ఇక మిగిలిన స్టార్ హీరోల పరిస్థితి సరేసరి. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారు పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ బిజీ గా ఉన్నారు. వాళ్ళని పెట్టి సినిమాలు తియ్యాలంటే బండ్ల గణేష్ వద్ద ఉన్న ఆస్తులు కూడా సరిపోవు. ఇక నటుడిగా కూడా ఆయన ఇంతకు ముందు ఉన్నంత బిజీ గా లేడనే చెప్పాలి.
