అమర్ కి అర్థరాత్రి బాడీ మసాజ్ చేస్తూ బిగ్ బాస్ 7 లో అడ్డం గా దొరికిపోయిన ప్రియాంక..వైరల్ అవుతున్న వీడియో!

- Advertisement -

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ 7 వ సీజన్ రీసెంట్ గానే గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ నుండే ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్నీ సీజన్స్ లో లాగా కాకుండా ఈ సీజన్ లో మొత్తం ‘ఉల్టా పల్టా’ గా ఉంటుందని నాగార్జున ఇది వరకే ఎన్నోసార్లు చెప్పాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్ కొనసాగుతుంది.

 బిగ్ బాస్ 7
బిగ్ బాస్ 7

ఇది ఇలా ఉండగా సీజన్ 5 లో షణ్ముఖ్ జస్వంత్ – సిరి జంట ఎంత పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారో మన అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరికీ లవర్స్ ఉన్నారు, అయినా కూడా హౌస్ లోకి వచ్చిన తర్వాత మితిమీరిపోయి రొమాన్స్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ సీజన్ లో అమర్ డీప్ మరియు ప్రియాంక కూడా మరో షణ్ముఖ్ – సిరి కాబోతున్నారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 Amar

ఇప్పటి వరకు వీళ్లిద్దరి మధ్య ఆ రేంజ్ రొమాన్స్ అయితే జరగలేదు కానీ, భవిష్యత్తులో జరిగే అవకాశం మాత్రం గట్టిగానే ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మొన్న రాత్రి అమర్ దీప్ వెనక్కి తిరిగి పడుకొని ఉంటే, ప్రియాంక అతని వీపై ఎక్కి బాడీ మసాజ్ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీళ్లిద్దరు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే మంచి స్నేహితులు.

- Advertisement -
Priyanka

‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ ద్వారా చాలా కాలం వీళ్ళు ప్రయాణం చేసారు. అందుకే అంత మంచి బాండింగ్ ఉందని అనుకోవచ్చు, ఇప్పటి వరకు అయితే ఆబగానె ఉన్నారు కానీ, మొన్న జరిగిన ఆ బాడీ మసాజ్ సన్నివేశం మాత్రం మళ్ళీ వీళ్లిద్దరు మరో షణ్ముఖ్ – సిరి జంట లాగ అవుతుందేమో అని భయపడుతున్నారు నెటిజెన్స్. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here