Bigg Boss : నన్ను టార్చర్ చేస్తున్నావ్ అంటూ అమర్ దీప్ ని నామినేట్ చేసిన ప్రియాంక..ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరుకున్న గొడవ!

- Advertisement -

Bigg Boss : ప్రతీ సీజన్ లో బిగ్ బాస్ షో క్లైమాక్స్ వారం కి వచ్చినప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎందుకంటే హౌస్ లో కంటెస్టెంట్స్ తక్కువ మంది ఉంటారు, కాబట్టి ఆ తక్కువ మందిలో ఎవరికీ అయితే ఎక్కువ కారణాలు ఉంటాయో, వారిని నామినేట్ చెయ్యాలి. అలాంటి పరిస్థితి ఈ వారం కూడా వచ్చింది.

Bigg Boss
Bigg Boss

అమర్ దీప్ మరియు ప్రియాంక మొదటి వారం నుండి ఎంతో మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. వీళ్ళు కేవలం హౌస్ లో ఉన్నప్పుడు మాత్రమే స్నేహితులు అయిన వాళ్ళు కాదు. అంతకు ముందు వీళ్లిద్దరు కలిసి మూడేళ్ళ పాటు ‘జానకి కలగనలేదు’ అనే సూపర్ హిట్ సీరియల్ లో నటించారు. అప్పటి నుండి మంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇన్ని వారాలు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోని ఈ ఇద్దరు, ఈ వారం నామినేట్ చేసుకోవాల్సి వచ్చింది.

గత వారం టికెట్ టు ఫినాలే టాస్కులో ఓడిపోయిన కంటెస్టెంట్స్ అందరూ తమ పాయింట్స్ ని తమ స్నేహితులకు ఇచ్చుకున్నారు. కానీ అమర్ దగ్గరకి వచ్చేసరికి ఆయన బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక అమర్ కి కాకుండా గౌతమ్ కి ఇస్తుంది. అందువల్ల అమర్ చాలా హర్ట్ అవుతాడు. ఓడిపోతానేమో అని భయం వచ్చినప్పుడల్లా అమర్ కి ప్రియాంక సహాయం చేయలేదనే విషయం గుర్తుకు వచ్చి బయటకి చెప్తూ ఉండేవాడు.

- Advertisement -

అందువల్ల ప్రియాంక ఈరోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో అమర్ ని నామినేట్ చేస్తుంది. నీ వల్ల గత వారం మొత్తం నేను నష్టపోయాను, టార్చర్ అనుభవించాను అని చెప్పుకొస్తూ అమర్ ని నామినేట్ చేస్తుంది. దీంతో సర్దుకుంది అనుకున్న గొడవ మళ్ళీ పెరిగింది. ఇద్దరి మధ్య గ్యాప్ బాగా ఏర్పడింది. అంతే కాకుండా ప్రియాంక పై అమర్ ఫ్యాన్స్ చాలా కోపం గా కూడా ఉన్నారు. చూడాలి మరి ఈ రెండు వారాలు ఎలా ఉండబోతుంది అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here