Priyanka Jain : బిగ్ బాస్ హౌస్ లో ప్రియుడితో హద్దులు దాటిన ప్రియాంక రొమాన్స్.. చూడలేక చస్తున్నాం అంటున్న ఆడియన్స్!

- Advertisement -

Priyanka Jain : ప్రస్తుతం ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా హౌస్ లోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. నిన్న శివాజీ కొడుకు, అశ్వినీ తల్లి మరియు అర్జున్ భార్య హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీళ్ళతో గడిపిన మధుర క్షణాలు ఆడియన్స్ కి కనుల పండుగ లాగ అనిపించింది. ముఖ్యంగా నిన్న శివాజీ మరియు ఆయన కొడుకు మధ్య జరిగిన సంభాషణలు ఆడియన్స్ ని కట్టిపారేశాయి.

SHivaji raja

ఇకపోతే ఈరోజు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక కాబొయ్యే భర్త శివ కుమార్ మరియు గౌతమ్ తల్లి ఎంటర్ అయ్యారు. వీరిలో గౌతమ్ మరియు అతని తల్లి ఆడియన్స్ ని ఎమోషనల్ అయ్యేలా చేసారు. ముఖ్యంగా గౌతమ్ వాళ్ళ అమ్మని చూడగానే యావర్ కి తన తల్లి గుర్తొచ్చి ఏడ్చేస్తాడు. అప్పుడు గౌతమ్ తల్లి యావర్ ని దగ్గరకి తీసుకొని ఓదారుస్తుంది.

Yawaar

నువ్వు కూడా మా అబ్బాయి గౌతమ్ కృష్ణ లాగానే, మా ఇంటికి వస్తూ వెళ్తుండు అని అంటుంది. ఈ ప్రోమో మొత్తం ఆడియన్స్ కి కంటతడి పెట్టేలా చేసింది. ఈమె వచ్చి వెళ్లిన తర్వాత ప్రియాంక కాబొయ్యే భర్త శివ కుమార్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. ఇతను ఎంటర్ అవ్వగానే హగ్గులు, కిస్సులతో రెచ్చిపోతాడు. ఎదో ఒకసారి అంటే పర్వాలేదు కానీ, హౌస్ లోకి వచ్చి తిరిగి వెళ్లేంత వరకు అదే పని అవ్వడం తో ఆడియన్స్ కాస్త చిరాకు పడ్డారు.

- Advertisement -
Priyanka Jain
Priyanka Jain

వంటింట్లో ఉన్నప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని శివ కుమార్ ని ప్రియాంక అడగగా, నువ్వు బయటకి రాగానే చేసుకుందాం అని అంటాడు శివ కుమార్. అప్పుడు ప్రియాంక అప్పటి దాకా ఎందుకు, ఇప్పుడే చేసుకుందాం అని అంటుంది. అలా ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here