Priyanka Jain : ఫౌల్స్ చేసి అడ్డంగా దొరికిపోయిన ప్రియాంక.. వీకెండ్ లో నాగార్జున చేతిలో కోటింగ్ మామూలుగా ఉండదు!

- Advertisement -

Priyanka Jain : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఆడినన్ని ఫౌల్ గేమ్స్ ఏ సీజన్ లో కూడా ఆడలేదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండు మూడు గ్రూప్స్ గా ఫామ్ అయ్యి ఆదుకోవడం అనేది ప్రతీ సీజన్ లో జరుగుతూనే ఉంది. దానిని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే అలా ఉంటేనే షో రక్తికడుతుంది.

Priyanka Jain
Priyanka Jain

కానీ అందరూ అప్పట్లో ఎలా గేమ్స్ ఆడి గెలవాలి అని చూసేవాళ్ళు, కానీ ఈ సీజన్ లో ఎలా అయినా మనమే గెలవాలి అని ఫౌల్ గేమ్స్ ఆడుతున్నారు. గత వారం లో శివాజీ మరియు యావర్ ఫౌల్ గేమ్స్ ఆడి నాగార్జున చేత క్లాస్ పీకించుకున్నారు. ఈ వారం కెప్టెన్ ప్రియాంక మరియు శోభా శెట్టి ఫౌల్ గేమ్ ఆడి మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఈ వారం మొత్తం బిగ్ బాస్ మ్యాన్షన్ లో జరిగిన మిస్సెస్ బిగ్ బాస్ హత్య కేసు ని సాల్వ్ చేసే టాస్కు జరుగుతుంది.

AMar arjun

ఈ టాస్కు లో అమర్ దీప్ మరియు అర్జున్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా నటించారు. అయితే బిగ్ బాస్ తొలుత శివాజీ కి ప్రశాంత్, గౌతమ్ మరియు అశ్వినీ ని మర్డర్స్ చేసే టాస్కులను ఇచ్చాడు. కానీ గౌతమ్ ని మర్డర్ చెయ్యడం లో శివాజీ ఫెయిల్ అవ్వడం తో ఆ టాస్కుని ప్రియాంక కి ఇవ్వమంటాడు. ప్రియాంక గౌతమ్ ని విజయవంతంగా మర్డర్ చేస్తుంది. ఆ తర్వాత ఆమెకి యావర్ ని మర్డర్ చేసే టాస్కుని ఇస్తాడు బిగ్ బాస్.

- Advertisement -
Yawar Priyanka

యావర్ మర్డర్ అవ్వాలంటే అతను వాడే హ్యాండ్ వాష్ లోషన్ మొత్తాన్ని ఖాళీ చేసి అందులో టీ పొయ్యాలి, ఆ తర్వాత అతని దానిని హ్యాండ్ వాష్ చేసుకుంటే మర్డర్ అయిపోయినట్టు అన్నమాట. ప్రియాంక ఈ టాస్కు ని విజయవంతంగా పూర్తి చేసి , యావర్ ని మర్డర్ అయ్యేలా చేస్తుంది. కానీ ఆమె శోభా శెట్టి ని సైగలతో పిలిచి కామన్ వాష్ రూమ్ వాడుకోకు, కేవలం వీఐపీ రూమ్ లో ఉన్న వాష్ రూమ్ ని మాత్రమే వాడుకో అని చెప్తుంది. దీంతో శోభా శెట్టి కి ప్రియాంకకు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అర్థం అయిపోయింది. ఇది రూల్స్ కి విరుద్ధం, వీకెండ్ నాగార్జున చేత ఆమెకి కోటింగ్ తప్పేలా కనిపించడం లేదని నెటిజెన్స్ అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here