Guess The Actress : 42 వయస్సులో రూ.40 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

- Advertisement -

Guess The Actress: అందం, అభినయం ఉన్న హీరోయిన్లకు వయసు పెరుగుతున్నా క్రేజ్ తగ్గట్లేదు.. 50 ఏళ్లు వచ్చినా కూడా ఇండస్ట్రీలో డిమాండ్ ను కొనసాగిస్తున్నారు.. కొందరు మాత్రమే క్యారెక్టర్స్ అంకితం అయితే మరికొందరు మెయిన్ రోల్స్ చేస్తున్నారు.. అలాంటి వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉంటారు.. ఆ హీరోయిన్ ఎవరో అర్థమైంది కదా.. అవును మీరు గెస్ చేసింది కరెక్టే.. ఆమె గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చొప్రానే..

Priyanka Chopra
Priyanka Chopra

ఈ అమ్మడు వయస్సు ప్రస్తుతం 42 ఏళ్లు.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.. బాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదు గానీ హాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ అనే రెండు ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్న ప్రియాంక చోప్రా, గత ఏడాది ‘సిటాడెల్’ అనే టీవీ సీరిస్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియాంక చోప్రా రూ.40 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ అందుకుందట.. ఇది నిజంగా పెద్ద అమౌంట్ నే..

ఆ తర్వాత ఆలియా భట్, ఒక్కో సినిమాకి రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది. దీపికా పదుకొనే, అత్యధికంగా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ డిమాండ్ చేస్తోంది.. వీళ్లను బీట్ చేసేలా రెండింతలు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ప్రియాంక చోప్రా కంటే అక్షయ్ కుమార్ వంటి హీరోల రెమ్యూనరేషన్ తక్కువగా ఉండడం విశేషం. ఇంతకుముందు వరుస హిట్లతో రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్న అక్షయ్ కుమార్, ప్రస్తుతం రూ.35 కోట్ల వరకూ మాత్రమే తీసుకుంటున్నాడట.. అందుకు కారణం ఆయనకు ఈ మధ్య సరైన హిట్ లేకపోవడమే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here