Priyanka Chopra : ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీస్ వింత వింత వ్యాధుల బారిన పడుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసే రకరకాల వింత జబ్బులకు గురవుతూ ఉండడం ఒకింత ఆందోళన కలిగించే విషయం. హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రెటీ వింత వ్యాధికి గురైనట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉంటుంది. మొన్నటివరకు బాలీవుడ్ లో సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకుని ఆతర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రియాంకకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, హిందీ, హాలీవుడ్ భాషల్లో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది ప్రియాంక. అలాగే బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్న వారిలో ముందు జాబితాలో నిలిచింది.
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటిలో వీరి వివాహం పెద్ద దుమారాన్నే రేపింది. కారణం ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు. తనకంటే పదేళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది ప్రియాంక చోప్రా. దీంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అయింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా హస్బెండ్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా నిక్ జోనస్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ షేర్ చేశాడు . నిక్ జోనాస్ ఇన్ఫ్లుఎంజా-ఎ అనే జబ్బుతో బాధపడుతున్నారట . ఈ క్రమంలోని మ్యూజిక్ చేయలేకపోతున్నానంటూ తన బాధను వీడియోలో షేర్ చేశారు. అలాగే ఈ వీడియోలో తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు . ఈ జబ్బు చాలా రేర్ గా వస్తుంది అంటున్నారు జనాలు. గొంతు నొప్పి, జ్వరం, దగ్గు హెవీగా ఉండడం ఈ జబ్బు లక్షణాలని తెలుస్తుంది. ఈ జబ్బు ట్రీట్ మెంట్ కి నిక్ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. ప్రియాంక, నిక్ దంపతులకు కూతురు కూడా ఉంది. సరోగసి ద్వారా ప్రియాంక చోప్రా బిడ్డకు తల్లి అయ్యింది. ఇప్పుడు నిక్ జోనస్ ఆరోగ్యం బాగోలేదు అని తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స చేస్తున్నారు.
View this post on Instagram