Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ, బాలివుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చొప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..ప్రస్తుతం ఈ అమ్మడు సిటాడెల్అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది..అది విడుదలకు సిద్ధమవుతుంది.. సిటాడెల్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రియాంక చోప్రా లీడ్ రోల్ చేసిన సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా సిటాడెల్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో ప్రియాంక చోప్రా పాల్గొన్నారు. నటుడు రిచర్డ్ మ్యాడెన్ తో చేసిన శృంగార సన్నివేశాల గురించి ఈ అమ్మడు తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసింది.. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

సిటాడెల్ సిరీస్లో బోల్డ్ సన్నివేశాల్లో నటించాను. ఆ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నేను, రిచర్డ్ ఒకరికొకరం మద్దతుగా నిలబడ్డాము. కొన్ని ఇబ్బందికర యాంగిల్స్ లో నటించాల్సి వచ్చింది. అప్పుడు బాగా అసౌకర్యంగా ఫీలయ్యాము. కెమెరాలో మా బాడీ పార్ట్స్ కనిపించకుండా చేతులతో కవర్ చేసుకునే వాళ్లం. రిచర్డ్ శరీరం కనిపించకుండా జాగ్రత్తలు చెప్పేవారు. ఒత్తిడికి గురి కాకుండా బోల్డ్ సన్నివేశాలు పూర్తి చేశామని ఈ బ్యూటీ చెప్పింది..అయితే, సిటాడెల్ సిరీస్ ఓ రేంజ్ లో ఆమె రెచ్చిపోయారని అర్థం అవుతుంది. ట్రైలర్ లో చూసింది కొంచమే అనిపిస్తుంది. కాగా సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కూడా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించే అవకాశం కలదు. సమంత గతంలో ది ఫ్యామిలీ మాన్ 2లో కూడా శృంగార సన్నివేశాల్లో నటించారు…

ఆ సినిమాను మించిన సన్నివేశాలు ఉన్నాయి..ఇక ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకున్నారు. తమిళ చిత్రం తమీజాతో ప్రియాంక చోప్రా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. విజయ్ ఆ చిత్ర హీరో. తర్వాత ఆమె సౌత్ ఇండియాలో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు.. 2018లో అమెరికన్ సింగర్ అండ్ యాక్టర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్నారు. నిక్ వయసులో ప్రియాంక చోప్రా కంటే 10 ఏళ్ళు చిన్నవాడు కావడం విశేషం. ఈ విషయంలో ఆమె పలుమార్లు ట్రోల్స్ కి గురయ్యారు.. ప్రస్తుతం ఆమె అధికంగా ఇంగ్లీష్ చిత్రాలు చేస్తున్నారు. హాలీవుడ్ లో పర్మినెంట్ గా సెటిలయ్యారు.. అక్కడే వరుస సినిమాలు చేస్తున్నారు..