Priyamani : సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో మంచి ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు ప్రియమణి. కెరీర్ ప్రారంభంలోనే ఈమె ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుందంటే ఆమె టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందంతో పాటుగా అద్భుతమైన అభినయం కూడా ఉండడం వల్లే ఆమె ఇన్ని ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. ఇంతమంది హీరోయిన్లు వచ్చినప్పటికీ కూడా ప్రియమణికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఆమె రేంజ్ ఏమిటో.

రీసెంట్ గానే ఆమె ‘భామ కలాపం 2 ‘ అనే చిత్రం చేసింది. గతం లో ఆహా డిజిటల్ మీడియా లో సూపర్ హిట్ గా నిల్చిన ‘భామ కలాపం’ సినిమాకి ఇది సీక్వెల్ గా చెప్పుకోవచ్చు. రీసెంట్ గానే విడుదలైన విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ప్రియమణి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

స్టార్ హీరోయిన్లు ఈమధ్య కాలం లో ఎక్కువగా జిమ్ వర్కౌట్స్ చేసి బయటకి వస్తూ ఫోటోగ్రాఫర్స్ కి ఫోజులు ఇవ్వడం వంటివి మనం గమనిస్తూనే ఉంటాం. ఇదంతా చూసి మనలాంటి వాళ్ళు, వీళ్ళకి ఎంత క్రేజ్ ఉందో అని అనుకుంటుంటాం. కానీ దీని వెనుక పెద్ద కథ దాగుంది అని ప్రియమణి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఒక ట్రెండ్ ఉంది. సోషల్ మీడియా లో హీరోయిన్లు జిమ్ నుండి బయటకి వస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు, వీడియోలు తియ్యడం మనం గమనిస్తూనే ఉంటాం. అవన్నీ డబ్బులు ఇచ్చి స్వయంగా హీరోయిన్స్ ఫోటోగ్రాఫర్స్ ని పిలిపించుకొని చేయించుకుంటారు. పూజా హెగ్డే, జాన్వీ కపూర్, రాశీ ఖన్నా వంటి హీరోయిన్లు అదే చేస్తారు. నాకు కూడా అలాంటి ఆఫర్స్ వచ్చాయి కానీ, నేను అందుకు అంగీకరించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.