Prince Yawar : బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో ఉల్టా పల్టా ట్విస్టుల నడుమ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఈ చివరి వారం లో టాప్ 6 కంటెస్టెంట్స్ గా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శివాజీ , యావర్, అర్జున్ మరియు ప్రియాంక నిలిచారు. ఈరోజు మధ్యాహ్నం నుండి గ్రాండ్ ఫినాలే షూటింగ్ మొదలు అయ్యింది. మొదట ఆరవ స్థానం లో అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు.
పది లక్షల ఆఫర్ బిగ్ బాస్ ఇవ్వగా ఆయన తీసుకునేందుకు ఒప్పుకోలేదు. అయ్యో కష్టపడి ఆడాడు, తీసుకొని ఉంటే బాగుండేది అని అందరికీ అనిపించింది. ఇకపోతే ఈ గ్రాండ్ ఫినాలే కి అనేక మంది అతిథులు వస్తారు అనేది మన అందరికీ తెలిసిందే. ముందుగా మాస్ మహారాజా రవితేజ వస్తాడు. కాసేపు హౌస్ మేట్స్ తో ముచ్చటించిన తర్వాత, టాప్ 5 కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసి బయటకి తీసుకొని రమ్మని రవితేజ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతాడు నాగార్జున.
ఉన్న 5 మంది కంటెస్టెంట్స్ లో ప్రియాంక కి అతి తక్కువ ఓట్లు రావడం ఆమె ఎలిమినేట్ అవుతుంది. రవితేజ తో కలిసి ఆమె బయటకి వచ్చేస్తుంది. ఇక మిగిలిన నలుగురికి నాగార్జున ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు. ఎవరో ఒకరు 15 లక్షల రూపాయిలను తీసుకొని బయటకి వచ్చేయొచ్చు అంటాడు. ప్రిన్స్ యావర్ ఈ ఆఫర్ కి ఒప్పుకొని 15 లక్షల రూపాయలతో బయటకి వచ్చేస్తాడు.
యావర్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషపడ్డారు. యావర్ ఆర్థికంగా బాగా వెనకబడిన వ్యక్తి అనే విషయాన్నీ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ తో ఒకసారి అంటాడు. ప్రస్తుతం అతను ఉన్న పరిస్థితికి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడని అందరి అభిప్రాయం. మొదటి వారం నుండి ప్రతీ టాస్కులోను ప్రాణం పెట్టి మరీ ఆడిన ప్రిన్స్ యావర్ కి దక్కాల్సిన ప్రతిఫలం దక్కింది అని అనుకుంటున్నారు.