సమంత వాడే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు.. అన్ని లక్షలా?

- Advertisement -

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమా ఆఫర్లను అందుకుంటున్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. దేశ విదేశాల్లో సమంత నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సమంత ఒకవైపు వరుస సినిమాలను చేస్తూనే మరోవైపు వివిధ రకరకాల వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతూ రెండు చేతులా సంపాదిస్తూ వస్తుంది.. అయితే ఇప్పుడు సమంత గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. సమంత దగ్గర చాలా విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్.. వాటి విలువ కోట్లల్లో ఉంటుదని సమాచారం.. అవేంటో ఓ లుక్ వేసుకోండి..

చెప్పులు :

సమంత
సమంత

సమంత ఎప్పుడూ బ్రాండ్ వాడుతూ ఉంటుంది.. సమంత చెప్పులు కూడా ఖరీదైనవే వాడుతారు. మలానో బ్లహనిక్స్ అనే బ్రాండ్ కు చెందిన వీటి ధర సుమారు లక్ష ఉంటుందని తెలుస్తుంది.. ఆ చెప్పుల ప్రత్యేకతలు ఏంటో తెలియదు కానీ, ఆ బ్రాండ్ మాత్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ అని తెలుస్తుంది…

- Advertisement -

హ్యాండ్ బ్యాగ్..

samantha Hand bag cost

మాములుగా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ మహా అయితే రూ.2000 వరకు ఉంటుంది. కానీ సమంత మాత్రం రూ.1.50 లక్షల విలువ చేసే బ్యాగ్ ను చేతికి వేసుకుంటారు.. ఈ బ్యాగ్ గుస్సి కంపెనీకి చెందిందని తెలుస్తుంది..దీనిని చాలా కొద్దిమంది మాత్రమే వాడుతారట. ఇదే కాకుండా రూ.2.5 లక్షల మరో బ్యాగ్ కూడా ఉందట..

samantha dress cost

అదే విధంగా సమంత డ్రెస్సులు విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటుంది.. సొంతంగా సాకీ వరల్డ్ అనే బ్రాండ్ డ్రెస్సుల షోరూం ఉంది. సమంత వీటినే ఎక్కువగా ధరిస్తారు.. ఇవి చాలా ఖరీదైనవని టాక్.. ఇకపోతే సమంతకు ఖరీదైన ఇల్లు కూడా ఉంది..అయితే ఈ ఇల్లు పుట్టినిల్లు కేరళ, మెట్టినిల్లు హైదరాబాద్లో కాదు. ముంబైలో. సముద్రపు ఒడ్డున ధనవంతులు ఉండే ఏరియాలో ఓ భవనాన్ని కొనుగోలు చేసింది. దీని ఖరీదు అక్షరాల రూ.15 కోట్లు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇవి మాత్రమే కాదు ఖరీదైన కారు, వాచ్, డైమండ్ నెక్లేస్ కూడా ఉందని సమాచారం.. ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here