Preity Zinta : ఒకప్పుడు ఇండస్ట్రీలో రాణించిన భామల్లో ప్రీతి జింటా ఒకరు. బాలీవుడ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది ప్రీతీ. ఇండస్ట్రీలో డింపుల్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు సోషల్ మీడియా వేదికగా సినీ తారలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రీతీ జీవితంలో ఓ భయానక సంఘటన ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. 1975 జనవరి 31న హిమాచల్‌లో జన్మించిన ప్రీతి జింటా నేటితో 49 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఈ గ్లామరస్ బ్యూటీ హిమాచల్‌లోని సిమ్లాలో జన్మించింది. అయితే ప్రీతీ బాల్యం చాలా భయానకంగా జరిగిందట. 13 సంవత్సరాల వయస్సులో, ఒక కారు ప్రమాదం ఆమె బాల్యాన్ని నాశనం చేసింది. ఈ ప్రమాదం ఆమెకు తన తండ్రి దుర్గానంద్ జింటాను దూరం చేసింది. అంతే కాదు చిన్న వయసులోనే తండ్రితో పాటు తల్లిని కూడా కోల్పోయింది ప్రీతి జింటా. తండ్రి కారు ప్రమాదంలో మరణించడంతో ప్రీతి తల్లి పరిస్థితి మరింత విషమించింది. ఈ ప్రమాదంలో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత ప్రీతి తల్లి రెండేళ్లుగా మంచానపడింది. ప్రీతికి 15 ఏళ్లు వచ్చేసరికి ఆమె తల్లి కూడా మరణించింది. తల్లితండ్రులు పోయిన బాధ నుంచి బయటకు వచ్చిన ప్రీతీ నటి కావాలని ప్రయతించింది. 1997లో శేఖర్ ‘తారా రమ్ పమ్’ చిత్రానికి ప్రీతీ సైన్ చేసింది.
ఈ చిత్రంలో ఆమె హృతిక్ రోషన్‌తో కలిసి నటించాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఆతర్వాత ఈ ఇద్దరు 2000లో మిషన్ కాశ్మీర్ చిత్రంలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కోయి మిల్ గయాలో కూడా కలిసి కనిపించారు. అయితే, ప్రీతి జింటా ఆగస్ట్ 21, 1998న మణిరత్నం యొక్క ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం నటనకు దూరంగా విదేశాల్లో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.