ప్రముఖ యూట్యూబర్లు సుమంత్ బొర్రా, వెంకటేష్ వుప్పల, తిరునగరి శరత్ చంద్ర, అనంత్ అశ్రిత్ లు ఈ సారి దేశభక్తిగీతంతో మనముందుకు వచ్చారు. ‘ప్రశ్నించు.. ప్రశ్నించు’ అంటూ సాగే పాట ద్వారా సమాజం లో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని నిలదీసేలా ఈ పాటని రూపొందించిన తీరు అద్భుతంగా ఉంది. లిరిక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. రాసిన ప్రతీ పాట ప్రేక్షకుల మనసులలోకి చొచ్చుకుపోయేలా ఉంది. ప్లానెట్ మ్యూజిక్ సంస్థ నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నీ కూడా ఇలా సమాజం మీదనే ఉంటాయి.
అలా ఇప్పటి వరకు విడుదలైన వాటిల్లో ఈ పాట ట్యూన్ పరంగా కూడా చాలా వినసొంపుగా ఉంది. రాబొయ్యే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మన నాయకుడిని ఎంచుకునే క్రమం లో ఇలాంటి పాటలు వినడం ఎంతో కొంత అయినా జనాల్లో చైతన్యం వస్తుంది. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తారు.
కానీ సమాజం లో నిండిపోయిన కల్తీని మాత్రం అరికట్టలేకపోతున్నారు రాజకీయ నాయకులూ. ప్రతీ ఏటా ఆడపిల్లలు మాయం అయిపోతున్నారు దీని గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరు?. అలాగే పరాయి దేశం మీద వ్యామోహం చూపే వారిని, అక్రమాలు, దౌర్జన్యాలు చేసే దుర్మార్గులని ప్రశ్నిస్తూ ఈ పాటకి అద్భుతమైన సాహిత్యం అందించాడు తిరునగరి శరత్ చంద్ర.
ఈ పాటకు మ్యూజిక్, మిక్సింగ్ & మాస్టరింగ్, ర్యాప్ ని వెంకటేష్ వుప్పల అందించగా, సుమంత్ బొర్రా, అనంత్ అశ్రిత్ లు పాడారు. సుమంత్ బొర్రా ప్రొడ్యూసర్ గా, బిపిన్ చంద్రహాస్ విజువల్ ఆర్ట్స్ ని అందించారు.
ఈ పాట జనవరి 26 న ప్లానెట్ రెడ్ మ్యూజిక్ ఛానల్ లో రిలీజ్ అయ్యింది. త్వరలోనే అన్నీ మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ పాట అందుబాటులోకి రానుంది. మీరు కూడా ఒకసారి ఈ పాటని విని మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపం లో తెలపండి.