Prashanth Varma : ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా హిట్‌గా నిలిచింది. ఇది పాన్ ఇండియా మూవీగా విడుదలై రూ.300 కోట్లు వసూలు చేసింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తక్కువ బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. హనుమాన్ విజువల్స్ ధర రూ. 100 కోట్లు అవుతుందని అనుకుంటారు. కానీ కేవలం రూ. 50 కోట్లతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత నిరంజన్ రెడ్డి కూడా ఈ సినిమాకి ఎంత చేయాలో అంత చేశారని చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలోనే తెలిపారు.

కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం బాగా వైరల్ అవుతోంది. సినిమాకు భారీ కలెక్షన్లు రావడంతో నిర్మాత, దర్శకుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. హనుమాన్ లాభాల్లో వాటా కోసం నిర్మాతతో ప్రశాంత్ గొడవ పడ్డాడని చాలా వెబ్‌సైట్లలో ప్రచారం జరిగింది. రూ.30 కోట్ల షేర్ ఇవ్వాలని నిర్మాతపై ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. అంతే కాకుండా ఈ సినిమా ‘జై హనుమాన్’ సీక్వెల్ విషయంలో కొంత అడ్వాన్స్‌తో పాటు లాభాల్లో వాటా కూడా అడిగాడంటూ వైరల్‌గా మారింది. తన షరతులు ఒప్పుకోకపోతే సీక్వెల్ కు పని చేయనని ప్రశాంత్ వర్మ చెప్పినట్లు రకరకాల వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా తన ట్విటర్ పేజీలో ఓ పోస్ట్ చేశారు. నిర్మాత నిరంజన్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను ప్రశాంత్ షేర్ చేశారు. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ఫోన్ చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇలా నెగిటివిటీని పంచవద్దు.. మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. హనుమాన్ స్క్రిప్ట్ ను కొనసాగిస్తున్నాం.. అంటూ ప్రశాంత్ వర్మ అన్నారు. ఒక్క పోస్ట్‌తో వీరి మధ్య గొడవ జరిగిందన్న పుకార్లకు చెక్ పెట్టాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చక్కగా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఇలాంటి వార్తల మధ్య చిచ్చు పెట్టేందుకు ఎవరు ప్రయత్నించారో తెలియాల్సి ఉంది.