Pragati : నటి ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్న ప్రగతి ఇమేజ్ డిఫరెంట్.. ప్రగతి ముఖ్యంగా హీరోయిన్స్‌కు తల్లిగా ఎక్కవ సినిమాల్లో కనిపించారు. బ్రహ్మానందం భార్యగా, హీరో లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుల్లో బాగా గుర్తుండి పోతుంది.

సినిమాలతో పాటు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన జిమ్ వీడియోలను షేర్ చేస్తుంది. ప్రగతి తన ఫిట్ నెస్ మీద ఎంత ఫోకస్‌గా ఉందో అందరికీ తెలిసిందే. కరోనా నుంచి ప్రగతి వర్కౌట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు నెట్టింట్లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రగతికి తన ఫిట్ నెస్‌కు తగ్గ మోడ్రన్ రోల్స్ వస్తున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను అరబోస్తూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఒకవైపు సినిమాలు.. మరో వైపు ఫిట్నెస్ పై కూడా ఎక్కువ ఫోకస్ చేస్తుంది. రోజు జిమ్ కు వెళ్లి వీడియోలు కూడా పెట్టి ఖుషీ చేస్తుంది.
ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై ప్రగతి రఫ్పాడిస్తోంది. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో పాల్గొన్న ఈమె మెడల్ ను కూడా గెలుచుకుంది.. కాగా తాజాగా మరో వీడియోను అభిమానులతో పంచుకుంది. గల్లీలో బైక్ నడుపుతూ సందడి చేసింది. షర్ట్ విప్పి.. కేవలం ఇన్నర్ వేర్ పైన రౌడీలా బైక్ నడిపింది ప్రగతి.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వయసులోనూ ఇంత డెడికేటెడ్‌గా కష్టపడుతున్న ప్రగతిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.